ఫిషింగ్ హార్బర్ స్థల పరిశీలన
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:29 PM
పిన్నివారిపాలెం తీర ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం పరిశీలించారు. స్థలం విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితుల గురించి రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. కొత్తపట్నం మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ముందుగా కొత్తపట్నం పల్లెపాలెంలో పర్యటించి మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార గ్రామంలో ఆ మె పర్యటించి వారి జీవన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.వారు ఎదుర్కొంటున్నసమస్యలను శ్రద్ధగా విన్నారు.
కొత్తపట్నం(ఒంగోలు నగరం) జూలై 15: పిన్నివారిపాలెం తీర ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం పరిశీలించారు. స్థలం విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితుల గురించి రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. కొత్తపట్నం మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ముందుగా కొత్తపట్నం పల్లెపాలెంలో పర్యటించి మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార గ్రామంలో ఆ మె పర్యటించి వారి జీవన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.వారు ఎదుర్కొంటున్నసమస్యలను శ్రద్ధగా విన్నారు. తీరంలో పర్యటించి వలలను, బోట్లను పరిశీలించారు. వేటలో ఎదురవుతున్న ఇబ్బందులను గురించి ఆమె మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులు చేపలు ఎండబెట్టుకునేందుకు స్థలం కేటాయించాలని కోరారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖరరెడ్డి మత్స్యకారులకు ప్రభుత్వం అందించే పథకాలను మత్స్యకారులకు చేరువ చేస్తున్నట్లు వివరించారు. పరిశీలించారు అనంతరం ఆ మె పాదర్తి వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాత్రి సమయంలో ఆమె పాఠశాలలోని విద్యార్థినులతో ఎక్కువసేపు గడిపారు. వారికి పాఠశాలలో అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించారు. వారి కోసం సిద్ధంగా ఉంచి కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులనాణ్యతను ఆమె పరిశీలించారు. మెనూ సక్రమంగా అ మలు జరుగుతుందా అంటూ విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల బోధన మీకు అర్థం అయ్యేలా ఉంటుందా అంటూ వారిని అడిగారు. క్రమ శిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆమె విద్యార్థులను కోరారు. ప్రభుత్వం కేజీబీవీ లాంటి పాఠశాలలను ఏర్పాటు చేసి పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తుందని, విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. ఆమె వెంట మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖరరెడ్డి, కె పల్లెపాలెం ఎంపీటీసీ నరసింహారావు , గ్రామ కాపులు తదితరులు పాల్గొన్నారు.