Share News

మద్దిరాల ఎడ్లకు ప్రథమ బహుమతి

ABN , Publish Date - Jan 30 , 2024 | 10:58 PM

కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో గుత్తికొండ రామయోగి స్వామి 113 వ తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా ఒంగోలు జాతి గిత్తల రాష్ట్ర స్థాయి బల ప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మంగళవారం న్యూ కేటగిరీ విభాగంలో పోటీలు నిర్వహించారు. మొత్తం 10 ఎడ్ల జతలు పోటీలలో పాల్గొన్నాయి. అట్టహాసంగా ఎడ్ల బలప్రదర్శన జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున పోటీలను తిలకించారు.

మద్దిరాల ఎడ్లకు ప్రథమ బహుమతి

కురిచేడు, జనవరి 30 : కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో గుత్తికొండ రామయోగి స్వామి 113 వ తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా ఒంగోలు జాతి గిత్తల రాష్ట్ర స్థాయి బల ప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మంగళవారం న్యూ కేటగిరీ విభాగంలో పోటీలు నిర్వహించారు. మొత్తం 10 ఎడ్ల జతలు పోటీలలో పాల్గొన్నాయి. అట్టహాసంగా ఎడ్ల బలప్రదర్శన జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున పోటీలను తిలకించారు. వారికి చీమకుర్తికి చెందిన గ్రానైట్‌ వ్యాపారి నుసుం గోవిందరెడ్డి భోజన సదుపాయం కల్పించారు. ప్రథమ బహుమతిని నాగులుప్పలపాడు మండలం మద్దిరాల, ముప్పాళ్ల గ్రామానికి చెం దిన పుచ్చకాయల శేషాద్రి చౌదరి ఎడ్ల జత 4436.10 అడుగులు లాగి కైవసం చేసుకున్నాయి. వారికి రూ.50వేలు చీమకుర్తికి చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్‌ మారం వెంకారెడ్డి అందజేశారు. ద్వితీయ బహుమతిని హైదరాబాద్‌కు చెందిన మేకా ప్రతీక్‌ ఎడ్ల జత 4382 అడుగులు లాగి కైవసం చేసుకున్నాయి. వారికి కురిచేడుకు చెందిన ఆవుల వెంకట రెడ్డి రూ.40 వేలను అందజేశారు. ముండ్లమూరు మండలం గంగన్నపాలెం గ్రామానికి చెందిన ఉమ్మారెడ్డి శ్రీవల్లి ఎడ్ల జత 3900 అడుగులు లాగి తృతీయ బహుమతిని గెలుచుకున్నాయి. వారికి నుసుం గోవింద రెడ్డి రూ.30వేల బహుమతిని అందజేశారు. ఉత్సాహభరితంగా సాగిన ఎడ్ల బలప్రదర్శన ఆహుతులను ఆకట్టుకున్నది.

Updated Date - Jan 30 , 2024 | 10:58 PM