సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం !
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:05 PM
అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించేంత వరకూ పోరాటం ఆగదని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ క్లస్టర్ నాయకురాలు ఐనెంపూడి రాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జరిగిన 32వ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చాలీ చాలని జీతాలతో అంగన్‌వాడీల కుటుంభాలు ఆర్థికంగా చితికి పోతున్నాయన్నారు.

- ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
కనిగిరి, జనవరి 12: అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించేంత వరకూ పోరాటం ఆగదని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ క్లస్టర్ నాయకురాలు ఐనెంపూడి రాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జరిగిన 32వ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చాలీ చాలని జీతాలతో అంగన్‌వాడీల కుటుంభాలు ఆర్థికంగా చితికి పోతున్నాయన్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించటంతో పాటు ఉద్యోగోన్నతులు కల్పించి వేతనాలు పెంచుతామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సీఎం జగన్ మాట తప్పి చరిత్ర హీనుడయ్యారన్నారు. సేవాభావంతో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించటం సిగ్గు చేటు అన్నారు. ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చి నిరవధిక నిరాహార దీక్షలకు సిద్ధమౌతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పీసీ కేశవరావు, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు రజని, రాజేశ్వరి, సీత, రామసుబ్బులు, సౌందర్య, డీవైఎ్‌ఫఐ నాయకులు నరేంద్ర, జేవీవీ నాయకులు జీ శ్రీనివాసులు, ఐద్వా మహిళలు శాంతకుమారి, ప్రసన్న పాల్గొన్నారు.