Share News

హోరాహోరీగా ఎడ్లబలప్రదర్శన పోటీలు

ABN , Publish Date - Jan 07 , 2024 | 09:57 PM

జనసేన పార్టీ నాయకుడు గరికపాటి వెంకట్‌ ఆధ్వర్యంలో దర్శిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు హోరాహోరీగా సా గుతున్నాయి. దర్శి ప్రాంతంలో గతంలో ఎన్నడూలేని విధంగా నాలుగు రోజులు పాటు భారీ స్థాయిలో జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఏర్పాటు చేయడంతో ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు పోటెత్తారు.

హోరాహోరీగా ఎడ్లబలప్రదర్శన పోటీలు
మొదటి బహుమతిని తోట శ్రీనివాసరావుకు అందజేస్తున్న జనసేన పార్టీ నేత వెంకట్‌

చూసేందుకు పోటెత్తుతున్న ప్రజలు

దర్శి, జనవరి 7 : జనసేన పార్టీ నాయకుడు గరికపాటి వెంకట్‌ ఆధ్వర్యంలో దర్శిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు హోరాహోరీగా సా గుతున్నాయి. దర్శి ప్రాంతంలో గతంలో ఎన్నడూలేని విధంగా నాలుగు రోజులు పాటు భారీ స్థాయిలో జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఏర్పాటు చేయడంతో ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు పోటెత్తారు. వం దలాది మంది మహిళలు కూడా వేదిక వద్ద కూర్చుని పోటీలు తిలకించడం విశేషం. తొలిరోజు శనివారం నాలుగు పళ్ల ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించగా అత్యధికంగా 38 జతలు పాల్గొన్న విషయం తెలిసిందే. తొలిరో జు పోటీలు పూర్తయ్యే సరికి అర్ధరాత్రి 2 గం టల సమయం పట్టింది. పోటీలు పూర్తయిన తర్వాత విజేతలకు బహుమతులు ప్రదానం చే శారు. రెండవ రోజు ఆదివారం ఆరుపళ్ల ఎడ్ల బలప్రదర్శన పోటీలకు 21 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. ఈ రోజు కూడా పోటీలు అర్ధరాత్రి వ రకు కొనసాగే అవకాశం ఉంది. మూడవ రోజు సోమవారం న్యూ క్యాటగిరీ ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తారు. 9వ తేదీ చివరిరోజున మంగళశారం సీనియర్‌ క్యాటగిరీ ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తారు. దర్శి - అద్దంకి రోడ్డులో పోలాల్లో విశాలమైన మైదానంలో పోటీలు నిర్వహిస్తున్నారు. వేధికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్య అతిథులు కూర్చునేందుకు వీలుగా 200 మంది ఆహుతులు కూర్చునే వీలుగా సభా వేదికను ఏ ర్పాటు చేశారు. బలప్రదర్శన పోటీలు నిర్వహించే సభ చుట్టూ గ్యాలరీని ఏర్పాటు చేసి ప్రజలు చూసేందుకు వీలుగా ఏర్పాటు చే శారు. మహిళలకు లోపల కుర్చీలు వేసి ప్ర త్యేక సదుపాయం కల్పించారు. పోటీలను తిలకించేందుకు వచ్చిన ప్రజలకు భోజన వసతి కల్పిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ ప్రభ విశేష ఆకర్షణగా నిలిచింది. ప్రభపై ప్రజలను అలరించేందుకు కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. నిర్వాహకుడు వెంకట్‌ను పలువురు అభినందిస్తున్నారు. చివరి రెండు రోజులు భారీ స్థాయిలో ఎడ్లు వచ్చే అవకాశం ఉన్నందున పోటీలు ఉత్కంఠంగా సాగే అవకాశం ఉంది. పోటీలను తిలకించేందుకు అధికసంఖ్యలో యువత పాల్గొని ఆస్వాదించారు.

నాలుగుపళ్ల ఎడ్ల బలప్రదర్శనలో

విజేతలకు బహుమతులు ప్రదానం

జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ నాయకుడు గరికపాటి వెంకట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో తొలిరోజు జరిగిన నాలుగు పళ్ల ఎడ్ల పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో గుంటూరు జిల్లా, కుప్పురావూరుకు చెందిన తోటా శ్రీనివాసరావు ఎడ్లు 15 నిమిషాల్లో 4269.5 అడుగుల దూరం బండను లాగి ప్రథమ స్థానం సాధించారు. గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన మోదుగుల రామిరెడ్డి ఎడ్లు 4202.9 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం పొందారు. గరికపాటి వెంకట్‌కు చెందిన ఎడ్లు 4202.5 అడుగుల దూరం లాగి మూడవ స్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లా, సరిపూడికి చెందిన శాఖమూరి రామకోటయ్య, వెదుళ్లపల్లి శ్రీనివాసరావు ఎడ్లు 4200 అడుగుల దూరం లాగి నాల్గవ స్థానం, పల్నాడు జిల్లా, గురజాలకు చెందిన లింగా అంజయ్యచౌదరి ఎడ్లు 4131.3 అడుగుల దూరం లాగి ఐదవ, గుంటూరు జిల్లా కుప్పురావురుకు చెందిన తోటా శ్రీనివాసరావు ఎడ్లు 4110.4 అడుగుల దూరం లాగి ఆరవ, ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెంకు చెందిన పునాది శ్రీనివాసరెడ్డి ఎడ్లు 3908.1 అడుగు దూరం లాగి ఏడవ, నంద్యాల జిల్లా, పులిగెల గ్రామంకు చెందిన బత్తుల జనార్దన్‌రెడ్డి ఎడ్లు 3773.5 అడుగుల దూరం లాగి ఎనిమిదవ, గుంటూరు జిల్లా, తక్కెళ్లపాడుకు చెందిన నందిపాటి శ్రీజరి భవాగ్న, అభయ్‌రామ్‌ తరుణ్‌తేజ్‌కు చెందిన ఎడ్లు 3681 అడుగుల దూరం లాగి తొమ్మిదవ స్థానం సాధించాయి. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.50వేలు, రెండవ బహుమతిగా రూ.40వేలు, మూడవ బహుమతి రూ.30 వేలు, నాల్గవ బహుమతిగా రూ.25వేలు, ఐదవ బహుమతిగా రూ.20వేలు, ఆరవ బహుమతిగా రూ.18 వేలు, ఏడవ బహుమతిగా రూ.15వేలు, ఎనిమిదవ బహుమతిగా రూ.10వేలు, తొమ్మిదవ బహుమతిగా రూ.8వేలు నగదును అందజేశారు. పోటీల్లో పాల్గొన్న అన్ని జట్లకూ రూ.6వేలు చొప్పున ప్రత్యేక బహుమతులను అందజేశారు. ఎడ్ల యజమానులందరినీ శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.

Updated Date - Jan 07 , 2024 | 09:57 PM