Share News

వైసీపీ సేవలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:59 PM

ఎన్నికల కమిషన్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చినా కొందరు ఉద్యోగులు వైసీపీకి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

వైసీపీ సేవలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌
వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమంలో ఫీల్డ్‌అసిస్టెంట్‌ శివారెడ్డి

తాళ్లూరు, ఏప్రిల్‌ 19 : ఎన్నికల కమిషన్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చినా కొందరు ఉద్యోగులు వైసీపీకి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మండలంలోని బొద్దికూరపాడు ఉపాధి క్షేత్రసహాయకుడిగా పనిచేస్తున్న గంగవరపు శివారెడ్డి దర్శిలో గురువారం జరిగిన వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, దర్శి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాదరెడ్డి నామినేషన్‌కు వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళుతుండగా, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శివారెడ్డి కార్యకర్తలతో కలిసి ముందుకుసాగారు.

Updated Date - Apr 19 , 2024 | 11:59 PM