Share News

అరకొరగా వచ్చిన పాఠ్యపుస్తకాలు

ABN , Publish Date - Jun 10 , 2024 | 10:43 PM

విద్యా సంవత్సరం మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఆయా పాఠశాలలలోని విద్యార్థులకు అవసర మైన పాఠ్యపుస్తకాలు అరకొరగా మండలానికి చేరాయి. మండలంలో మొత్తం 76వేల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అవసరంకాగా వాటిలో కేవలం 56 వేల మంది విద్యార్థులకు మాత్రమే పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు చేరాయి.

అరకొరగా వచ్చిన పాఠ్యపుస్తకాలు
ఎంఆర్‌సీకి చేరిన పాఠ్యపుస్తకాలను పరిశీలిస్తున్న ఎంఈవోలు

రేపు పాఠశాలలు పునఃప్రారంభం

రాని టెన్త్‌ పీఎస్‌, 7వతరగతి పుస్తకాలు

ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆందోళన

అద్దంకిటౌన్‌, జూన్‌ 10 : విద్యా సంవత్సరం మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఆయా పాఠశాలలలోని విద్యార్థులకు అవసర మైన పాఠ్యపుస్తకాలు అరకొరగా మండలానికి చేరాయి. మండలంలో మొత్తం 76వేల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అవసరంకాగా వాటిలో కేవలం 56 వేల మంది విద్యార్థులకు మాత్రమే పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు చేరాయి. దీనికితోడు పలు తరగతులకు అ స లు పాఠ్యపుస్తకాలు రాకపోగా మరో తరగతికి సంబంధించి ఒక సబ్జెక్ట్‌ పుస్తకాలు రాలేదు. దీంతో పాఠశాలలు ప్రారంభమవుతున్న తరుణంలో పుస్తకాలు రాకపోతే ఎలా అని విద్యా శాఖ అదికారులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

అద్దంకి మండలంలో మొత్తం ప్రభుత్వ పాథమిక పాఠశాలలు 65 ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు 4, ఉన్నత పాఠశాలలు 13 ఉన్నాయి. వీటితోపాటు ఎయిడెడ్‌ పాఠశాలలు మూడు ఉన్నాయి. వీటి అన్నింటికీ సంబంధించి రానున్న 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం పాఠ్యపుస్తకాలు అరకొరగా మండల విద్యా వనరుల కేంద్రానికి వచ్చాయి. మండల విద్యాశాఖ అధికారులు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతివరకు 76 వేల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అవసరమని రాష్ట్ర విద్యాశాఖకు తెలిపారు. వాటిలో కేవలం 56వేల మందికి మాత్రమే పాఠ్యపుస్తకాలను పంపారు. వాటిలోను 7వతరగతికి సంబంధించి ఒక్క పాఠ్యప్తుకం కూడా రాలేదు. అ లాగే పదవ తరగతి పీఎస్‌ సబ్జెక్ట్‌కు పుస్తకాలు రాలేదు. మరో రెండు రోజులల్లో పాఠశాలలు ప్రారంభం కాబోతుండగా నేటికీ అన్ని పుస్తకాలు రాకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

56వేల పాఠ్యపుస్తకాలు వచ్చాయి

అద్దంకి మండలంలో 76వేల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అవసరం అని జిల్లా, రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు తెలియజేశామని ఎంఈవోలు డీ గంగాధరరావు, బీ సుధాకరరావు తెలిపారు. వాటిలో ఇప్పటికి 56వేల మందికి మాత్రమే పుస్తకాలు వచ్చాయని, మిగిలిన పాఠ్యపుస్తకాలు త్వరలో వస్తాయన్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 11,006 పాఠ్యపుస్తకాలు, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 15,610 పుస్తకాలు వచ్చాయన్నారు. ఏపీసీ ఆదేశాల మేరకు వారి కేటాయించిన తేదీలోపు అన్ని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలకు పాఠ్యస్తకాలు, నోట్‌ పుస్తకాలు, షూ అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా రాష్ట్ర విద్యాశాఖ తగు చర్యలు తీసుకుంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంఈవోలు కోరారు.

Updated Date - Jun 10 , 2024 | 10:43 PM