ఒక వైపు తండ్రి ... మరో వైపు తనయుడు
ABN , Publish Date - Apr 03 , 2024 | 10:31 PM
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అ భ్యర్థి ఎంఎం కొండయ్య, ఆయన తనయుడు మహేంద్రనాథ్ బుధవారం పార్టీల శ్రేణులతో కలసి వేర్వేరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొండయ్య మండలంలోని ఈపురుపాలెంలో నాయకులు, కార్యకర్తలతో కలసి ఇం టింటి ప్రచారం నిర్వహించారు.

ఈపురుపాలెంలో అభ్యర్థి కొండయ్య... కొట్లబజారులో మహేంద్రనాథ్ ప్రచారం
చీరాల, ఏప్రిల్ 3 : ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అ భ్యర్థి ఎంఎం కొండయ్య, ఆయన తనయుడు మహేంద్రనాథ్ బుధవారం పార్టీల శ్రేణులతో కలసి వేర్వేరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొండయ్య మండలంలోని ఈపురుపాలెంలో నాయకులు, కార్యకర్తలతో కలసి ఇం టింటి ప్రచారం నిర్వహించారు. నాయకులు గుద్దంటి చంద్రమౌళి, కొమ్మనబోయిన రజని తదితరులు ఆయా ప్రాంతాల వారిని పరిచయం చేశారు. ప్రధానంగా మేనిఫెస్టోలోని సూపర్‌సిక్స్, బీసీ డిక్లరేషన్ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నా రు. దీంతో వారు పర్యటించిన ప్రాంతాల్లో సా నుకూలత లభించింది. సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. పట్టణంలోని కొట్లబజారులో తదితర ప్రాంతాల్లో కొం డయ్య కుమారుడు మహేంద్రనాథ్, పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు, ఎంఆర్‌ఎప్ రమేష్, నాయకులు, కార్యకర్తలతో కలసి ప్రచారంలో పాల్గొన్నారు. సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు. పార్టీ కార్యాలయంలో పలువురు పాస్టర్లు కొండయ్యను కల సి ఆత్మీయతను తెలిపారు. ఆయా కార్యక్రమా ల్లో టీడీపీ, జనసే, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.