Share News

రైతన్నలకు అందని భరోసా

ABN , Publish Date - May 24 , 2024 | 12:11 AM

రైతుకు అన్ని విధాల అండగా ఉంటాం. అని ప్రభుత్వం ప్రకటి స్తున్నా.., గ్రామాల్లో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

రైతన్నలకు అందని భరోసా

మార్కాపురం రూరల్‌, మే 23: రైతుకు అన్ని విధాల అండగా ఉంటాం. అని ప్రభుత్వం ప్రకటి స్తున్నా.., గ్రామాల్లో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. తొలకరి వర్షాలు పడి రైతన్నలు తమ భూములను సాగు చేసుకునేందుకు సమాయత్తం చేసుకుంటున్నారు. ఇలాంటి కీలక సమయంలోనూ గ్రామాల్లోని ఆర్‌బీకే లలో సిబ్బంది కనిపించడం లేదు.

మండలంలోని బోడపాడు, రాయవరం, మాల్య వంతునిపాడు, గజ్జలకొండ గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాలలో గ్రామస్థాయి వ్యవ సాయ శాఖ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండడం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బోడపాడులో రైతు భరోసా కేంద్రం అద్దెరేకుల ఇంట్లో ఏర్పాటు చేశారు. కానీ సుమా రు రెండు మూడు నెలలుగా కేంద్రానికి తాళాలు కూడా తీయలేదని గ్రామస్థు లు తెలిపారు. దరిమడుగులో వ్యవసా య సహాయులు అందుబాటులో లేకపోవడంతో గేట్లు కూడా తీయలేదు. దీంతో పాటు మాల్యవంతునిపాడు, రాయవరం, గజ్జలకొండ గ్రామాలలో కూడా గ్రామ సహాయకులు అందుబాటులో లేక ఇతర గ్రామాల్లో పనిచేస్తున్న వారిని ఇన్‌చార్జులుగా నియమించారు. వారు కూడా గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలకు అప్పుడప్పుడు చుట్టం చూపు లా వచ్చి పోతున్నారే గాని రైతులకు అందు బాటులో ఉండడం లేదు. మండలం లో 20 ఆర్‌బీకేలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ వాటిలో ప్రస్తుతం ఒకటి రెండు చోట్ల మాత్రమే అధికారులు అందుబాటులో ఉంటున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి రైతులు భూములను దుక్కు లు దున్నుకొని వ్యవసాయానికి సమాయత్తం చేసుకుంటున్నారు. ఏ పొలంలో ఏ పంట వేయాలనే సలహా లు తీసుకునేందుకు ఆర్‌బీకేలకు వెళ్లి తెలుసు కోవాలనుకుంటే అక్కడ ఎవరు ఉండటం లేదని రైతులు అంటున్నారు.

ఈ ఏడాది భూసార పరీక్షలు కూడా చేయడం లేదు. భూసార పరీక్షలు నిర్వహించి ఏ పంట వేస్తే రైతులకు అధిక దిగుబడులు వస్తాయో ఆ వివరాలను అధికారులు తెలియజేయాలి. కానీ ఈ సంవత్సరం భూసార పరీక్షలు కూడా వ్యవసాయ అధికారులు చేయడం లేదని రైతులు పేర్కొంటు న్నారు. గ్రామస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలు కేవలం అలంకార ప్రాయంగా మాత్రమే ఉన్నాయని వాటి వలన రైతులకు ఎటువంటి ఉపయోగం లేదని రైతన్నలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 24 , 2024 | 12:11 AM