Share News

నీరు, మట్టి పరీక్షలపై రైతులకు అవగాహన

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:06 AM

మండలం లోని వేములకోట గ్రామంలో ఉద్యానవన శాఖ పర్యవేక్షణలో డిజిటల్‌ గ్రీన్‌ వారి ఆధ్వర్యంలో రైతులకు నీరు, మట్టి పరీక్షలపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.

నీరు, మట్టి పరీక్షలపై రైతులకు అవగాహన

మార్కాపురం రూరల్‌, జూన్‌ 11: మండలం లోని వేములకోట గ్రామంలో ఉద్యానవన శాఖ పర్యవేక్షణలో డిజిటల్‌ గ్రీన్‌ వారి ఆధ్వర్యంలో రైతులకు నీరు, మట్టి పరీక్షలపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్‌ గ్రీన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ కమలాకర్‌ మాట్లాడుతూ.. మట్టి పరీక్షలు ఎలా చేయాలి, వాటి వలన కలిగే ఉపయోగాలైన నేలలో ఉదజని సూచిక, స్థూల సూక్ష్మ పోష కాల లభ్యత ఎంతమేర ఉందనే విషయాలు తెలుస్తాయన్నారు. మట్టి పరీక్షల ఆధారంగా వచ్చిన ఫలితాలకు అనుగుణంగా తగు మోతాదులోనే రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగించు కోవాలన్నారు. రైతుల కు పెట్టుబడి తగ్గడమే గాక, మంచి నాణ్యమైన దిగుబడులు వస్తాయని వివ రించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు, మండలంలోని వీఏఏ శ్రీనివాసులు, ఉద్యానవన అధికారి రమేష్‌, మండలంలోని వీఏఏలు, వీహెచ్‌ఏలు, ఎంపీఈవోలు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:06 AM