Share News

ఉత్సాహంగా సాగుతున్న ఎడ్ల పోటీలు

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:59 PM

జనసేన పార్టీ దర్శి ని యోజకవర్గ నాయకుడు గరికపాటి వెంకట్‌ ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒం గోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. దర్శి పట్టణంలో వా రం రోజులు ముందుగానే సంక్రాంతి పండుగ కళ సంతరించుకుంది. సోమవారం న్యూ క్యాటగిరీ ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించారు.

ఉత్సాహంగా సాగుతున్న ఎడ్ల పోటీలు
పోటీలను తిలకిస్తున్న ఎమ్మెల్యే గొట్టిపాటి, మాజీ ఎమ్మెల్యేలు పాపారావు, ఆంజనేయులు

దర్శి, జనవరి 8 : జనసేన పార్టీ దర్శి ని యోజకవర్గ నాయకుడు గరికపాటి వెంకట్‌ ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒం గోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. దర్శి పట్టణంలో వా రం రోజులు ముందుగానే సంక్రాంతి పండుగ కళ సంతరించుకుంది. సోమవారం న్యూ క్యాటగిరీ ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 24 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ పోటీలు అర్ధరాతిర వరకు సాగా యి. పెద్ద ఎత్తున పోటీల్లో ఎడ్లు పాల్గొంటుండడంతో ఎక్కువ సమయం సాగుతోంది. పెద్దసంఖ్యలో మహిళలు కూడా వచ్చి పోటీలను తలికకిస్తున్నారు. పోటీలను తిలకించేందుకు వచ్చిన ప్రజలకు భోజన వసతి కల్పిస్తున్నారు. ఎడ్ల పోటీలను సోమవారం రాత్రి అ ద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీఆర్‌ ఆంజనేయులు, దర్శి ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్‌ పిచ్చయ్య, రాష్ట్ర విభిన్న ప్ర తిభావంతుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు తిలకించారు. చివరగా మంగళవారం సీనియర్‌ క్యాటగిరీ ఎడ్ల బలప్రదర్శనతో పోటీలు ముగుస్తాయి.

ఆరుపళ్ల ఎడ్ల విజేతలకు బహుమతుల అందజేత

జనసేన పార్టీ నేత గరికపాటి వెంకట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒం గోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో భా గంగా ఆదివారం నిర్వహించిన ఆరుపళ్ల ఎడ్ల బండలాగుడు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు గరికపాటి వెంకట్‌కు చెందిన ఎడ్లు 4117.7 అడుగుల దూరం బండను లాగి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాగులుప్పలపా డు మండలం, మద్దిరాలముప్పాలకు చెందిన పుచ్చకాయల శేషాద్రిచౌదరి ఎడ్లు 4090.6 అడుగుల దూరం బండను లాగి ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. గుంటూరు జిల్లా, కొండబాల వారిపాలెంకు చెందిన గూడవల్లి ల క్ష్మీ దీక్షిత చౌదరి ఎడ్లు 3727.4 అడుగుల దూ రం బండ లాగి మూడవ స్థానంలో నిలిచా యి. కర్నూల్‌ జిల్లా, పంచలింగాలకు చెందిన సుంకన్న బ్రదర్స్‌కు చెందిన ఎడ్లు 3632.3 అడుగుల దూరం లాగి నాల్గవస్థానం, గుం టూరు జిల్లా, డొప్పలపూడికి చెందిన పమిడి అంజయ్య, రాజుపాలెంకు చెందిన వినోద్‌కుమార్‌కు చెందిన ఎడ్లు 3631.5 అడుగుల దూ రం బండను లాగి ఐదవ స్థానం. నంద్యాల జిల్లా, మల్లెలకు చెందిన షేక్‌ మహిమున్నా ఎడ్లు 3441.5 అడుగుల దూరం బండను లాగి ఆరవ స్థానం, బాపట్ల జిల్లా, మార్టూరుకు చెందిన జీ వెంకటకృష్ణయ్యయాదవ్‌ ఎడ్లు 3300 అడుగుల దూరం బండను లాగి ఏడవస్థానం. కర్నూల్‌ జిల్లా, వెంకటగిరికి చెందిన పీఎల్‌కే బుక్స్‌ శశాంకకు చెందిన ఎడ్లు 3300 అడుగుల దూరం బండను లాగి ఏడవ స్థానం. కడప జిల్లా, దాసరపల్లికి చెందిన మొలకల చిన్నవీరన్న ఎడ్లు 3250.1 అడుగుల దూరం బండను లాగి ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 21 జతల ఎడ్లు పాల్గొన్నాయి. గెలుపొందిన ఎడ్ల యజమానులకు ప్రథమ బహుమతిగా రూ.60వేలు, ద్వితీయ రూ.50వేలు, మూడవ రూ.40వేలు, నాల్గవ రూ.30వేలు, ఐదవదిగా రూ.25వేలు, ఆరవదిగా రూ.20వేలు, ఏడవదిగా ఒకొక్కరికీ రూ.18వేలు, ఎనిమిదవ బహుమతిగా రూ.15వేల నగదు బహుమతిని వెంకట్‌ అందజేశారు.

Updated Date - Jan 08 , 2024 | 11:59 PM