Share News

రసవత్తరంగా బ్యాడ్మింటన్‌ పోటీలు

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:54 AM

రావి జయలక్ష్మి, సుబ్బారాయుడు ఇండోర్‌ స్టేడియంలో గురువారం ఉమ్మడి ప్రశాశం జిల్లాల స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో బాడ్మింటన్‌ పోటీలు రసవత్తరంగా జరిగాయి. పోటీలను కారుణ్య సేవా సమితి సెక్రటరీ గోవర్ధన్‌, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ హుమాయూన్‌ కబీర్‌ ప్రారంభించారు. అండర్‌-14, అండర్‌-17 విభాగాలలో జరిగిన ఈ పోటీలకు ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని వివిధ స్కూల్స్‌ నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలు ఆధ్యంతం పోటాపోటీగా సాగాయి.

రసవత్తరంగా బ్యాడ్మింటన్‌ పోటీలు
రాష్ట్రస్ధాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో నిర్వాహకులు

కొత్తపేట(చీరాల), అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : రావి జయలక్ష్మి, సుబ్బారాయుడు ఇండోర్‌ స్టేడియంలో గురువారం ఉమ్మడి ప్రశాశం జిల్లాల స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో బాడ్మింటన్‌ పోటీలు రసవత్తరంగా జరిగాయి. పోటీలను కారుణ్య సేవా సమితి సెక్రటరీ గోవర్ధన్‌, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ హుమాయూన్‌ కబీర్‌ ప్రారంభించారు. అండర్‌-14, అండర్‌-17 విభాగాలలో జరిగిన ఈ పోటీలకు ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని వివిధ స్కూల్స్‌ నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలు ఆధ్యంతం పోటాపోటీగా సాగాయి. హాజరైన వారికి నిర్వాహకులు ఉచిత భోజన, వసతి సదుపాయాలను కల్పించారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహక ప్రతినిధులు మూర్తి, ఎం.సీతాదేవి, కె.రాణి, శ్రీనివాసరావు, కోచ్‌ ప్రసాద్‌, పలు పాఠశాలల ఫిజికల్‌ డైరెక్టర్లతో పాటు పలువురు పేరెంట్స్‌, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు వీరే

పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు కోనసీమలోని మల్కిపురంలో జరిగే రాష్ట్రస్ధాయి పోటీలకు ఉమ్మడి ప్రకాశం జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని నిర్వహకులు తెలిపారు. పోటీలు ఈ నెల 28వ తేది నుంచి వచ్చేనెల 1వ తేది వరకు కొనసాగుతాయన్నారు.

అండర్‌ 14లో జి.షణ్ముఖవర్దన్‌, చైతన్య స్కూల్‌, ఒంగోలు, సీహెచ్‌ అర్జున్‌కుమార్‌, వై.పాలెం, విహాన్‌ జోష్‌, సెయింట్‌ఆన్స్‌, చీరాల, విపన్‌, సెయింట్‌ ఆన్స్‌, చీరాల, ఎస్‌.బి ఖాదర్‌బాషా, జడ్పీ పాఠశాల, మార్కాపురం, ఎన్‌.నిధి, అల్టస్‌ స్కూల్‌, చీరాల, ఎం.నవీషా, జడ్పీస్కూల్‌, గుంటుపల్లి, బి.పురోహితి, జడ్పీస్కూల్‌, గుంటుపల్లి, ఎం.మమిత, జెడ్పీస్కూల్‌, గుంటుపల్లి, బి. షావీలా, జెడ్పీస్కూల్‌, గుంటుపల్లి ఎంపికయ్యారు. అండర్‌ 17లో జి.నితిక, విద్యా కాలేజీ, చీరాల, సి. భువన, జడ్పీ స్కూల్‌, బి.పాలెం, జి. ఎష్విక, సెయింట్‌ ఆన్స్‌, చీరాల, ఎల్‌. లాస్య, జూనియర్‌ కాలేజి, బెస్తవారిపేట, జి.రిషిత, జూనియర్‌ కాలేజీ, బెస్తవారిపేట, ఎన్‌. తారకరాం, అల్టస్‌, చీరాల, వై. తారకరాం, సెయింట్‌ ఆన్స్‌, చీరాల, కె. అభిలాష్‌, జూనియర్‌ కాలేజీ, మార్కాపురం, బి.ప్రేమ్‌కుమార్‌, సెయింట్‌ ఆన్స్‌, చీరాల, డి.వెంకటేశ్వర్లు, శ్రీ గౌతమి, చీరాల, జెఐ ఆదిత్య, శ్రీ చైతన్య, చీరాల ఎంపికయ్యారు.

Updated Date - Oct 25 , 2024 | 12:54 AM