Share News

‘ స్వామి’కి అడుగడుగునా నీరాజనం

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:50 PM

కొండపి అసెంబ్లీ అభ్యర్థిగా నాల్గవ సారి తన నామినేషన్‌ను సిట్టింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నామినేషన్‌నువేశారు. ఎప్పటికప్పుడు ‘అంతకుమించి’ అన్న రీతిలో ప్రజలు భారీగా నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. గతంలో మూడు సార్లు వేసిన దానికన్నా ప్రజలు స్వామి నామినేషన్‌ కార్యక్రమానికి ఈదఫా హాజరయ్యారు. స్వామి ఉదయం టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలోని తన స్వగృహంలో పూజలు చేశారు. తర్వాత తన కుటుంబంలోని పెద్దలు ఆశీస్సులు తీసుకుని, అక్కడ నుంచి నేరుగా తన తల్లిదండ్రుల సమాధుల వద్ద వారి ఆశీస్సులు తీసుకున్నారు.

‘ స్వామి’కి అడుగడుగునా నీరాజనం
నామినేషన్‌ సందర్భంగా టీడీపీ నేతల ర్యాలీ

తొలుత ఇంటిలో పెద్దల ఆశీస్సులు

తల్లిదండ్రుల సమాధుల వద్ద పూజలు

వల్లూరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

టంగుటూరులో అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు నివాళులు అడుగడుగునా మహిళల హారతులు

కొండపి, ఏప్రిల్‌19 : కొండపి అసెంబ్లీ అభ్యర్థిగా నాల్గవ సారి తన నామినేషన్‌ను సిట్టింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నామినేషన్‌నువేశారు. ఎప్పటికప్పుడు ‘అంతకుమించి’ అన్న రీతిలో ప్రజలు భారీగా నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. గతంలో మూడు సార్లు వేసిన దానికన్నా ప్రజలు స్వామి నామినేషన్‌ కార్యక్రమానికి ఈదఫా హాజరయ్యారు. స్వామి ఉదయం టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలోని తన స్వగృహంలో పూజలు చేశారు. తర్వాత తన కుటుంబంలోని పెద్దలు ఆశీస్సులు తీసుకుని, అక్కడ నుంచి నేరుగా తన తల్లిదండ్రుల సమాధుల వద్ద వారి ఆశీస్సులు తీసుకున్నారు. గ్రామంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద పూజలు చేశారు. గ్రామంలోని దివంగత దామచర్ల ఆంజనేయులు, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వల్లూరమ్మ ఆలయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి దామచర్ల సత్యతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ టంగుటూరు కూడలిలోని బీఆర్‌ అంబేడ్కర్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం కొండపి వైపు కదిలారు. గ్రామగ్రామాన స్వామికి మహిళలు హారతులిచ్చారు. దాదాపు కొండపి వరకు చేరుకోవడానికి 30 నిమిషాలు పట్టేది ..అటువంటిది మూడున్నర గంటలపాటు వాహనశ్రేణికి సమయం పట్టింది. ర్యాలీలో ప్రతి గ్రామం నుంచి తెలుగు తమ్ముళ్లు కలిసి సాగారు. ప్రజలకు అభివాదం చేశారు. కొండపికి వచ్చే సరికి జనసంద్రంగా మారింది. గ్రామం వెలుపల నుంచి నడుచుకుంటూ వెళ్లి స్వామి నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ కార్యక్రమానికి దాదాపు 25వేలకు పైగా ప్రజలు హాజరయ్యారు. గత ఏడాది కన్నా నాలుగు వేలమంది అధికంగా హాజరయ్యారని పరిశీలకులు అంచనావేస్తున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:50 PM