Share News

ఎరిక్షన్‌.. పరఫెక్షన్‌...!

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:08 AM

ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నామినేషన్ల అనంతరం ప్రచార కార్యక్రమం హోరెత్తుతోంది. అయితే ఇప్పటికే జరిగిన, జరుగుతున్న ప్రచార కార్యక్రమం పరిశీలిస్తే తెలుగుదేశ కూటమి అభ్యర్థి ఎరిక్షన్‌బాబు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈపాటికే ఆయన రెండు మూడు పర్యాయాలు గ్రామాలన్నీ చుట్టేసి ప్రజలతో మమేకమయ్యారు. ప్రసుత్తం ఆయనతో పాటు ఆయన కుమారుడు, కుమార్తె కూడా ప్రచారంలోకి రావటంతో ముగ్గురు మూడు వైపులా ఊరూవాడా పర్యటిస్తున్నారు. మూడేళ్ల క్రితమే ఆయన నియోజకవర్గానికి వచ్చి అక్కడ వారినే అంటిపెట్టుకొని ఉండటం కలసివచ్చింది. తాజాగా హైదరాబాద్‌ నుంచి రంగంలోకి వచ్చిన వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌ పార్టీలో పరిస్థితులు చక్కబెట్టేందుకే సమయమంతా సరిపోవటంతో ప్రచార కార్యక్రమాల్లో వెనుకబడిపోయారు.

ఎరిక్షన్‌.. పరఫెక్షన్‌...!

ప్రచారంలో దూసుకుపోతున్న ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి

ఒకటికి రెండుమూడు సార్లు ఊళ్లన్నీ చుట్టేసిన వైనం

ప్రస్తుతం ఆయనతో పాటు పిల్లలూ ఇంటింటి ప్రచారం

ఆలస్యంగా వచ్చిన వైసీపీ అభ్యర్థి అన్ని గ్రామాలు తిరగలేని పరిస్థితి

నేతల మధ్య విభేదాల పరిష్కారానికే తాటిపర్తి ప్రాధాన్యత

ఆంధ్రజ్యోతి, ఒంగోలు :

ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నామినేషన్ల అనంతరం ప్రచార కార్యక్రమం హోరెత్తుతోంది. అయితే ఇప్పటికే జరిగిన, జరుగుతున్న ప్రచార కార్యక్రమం పరిశీలిస్తే తెలుగుదేశ కూటమి అభ్యర్థి ఎరిక్షన్‌బాబు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈపాటికే ఆయన రెండు మూడు పర్యాయాలు గ్రామాలన్నీ చుట్టేసి ప్రజలతో మమేకమయ్యారు. ప్రసుత్తం ఆయనతో పాటు ఆయన కుమారుడు, కుమార్తె కూడా ప్రచారంలోకి రావటంతో ముగ్గురు మూడు వైపులా ఊరూవాడా పర్యటిస్తున్నారు. మూడేళ్ల క్రితమే ఆయన నియోజకవర్గానికి వచ్చి అక్కడ వారినే అంటిపెట్టుకొని ఉండటం కలసివచ్చింది. తాజాగా హైదరాబాద్‌ నుంచి రంగంలోకి వచ్చిన వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌ పార్టీలో పరిస్థితులు చక్కబెట్టేందుకే సమయమంతా సరిపోవటంతో ప్రచార కార్యక్రమాల్లో వెనుకబడిపోయారు.

వైసీపీ నుంచి భారీగా చేరికలు

నియోజకవర్గంలో సుమారు 10వేల మందికి పైగా గిరిజన ఓటర్లు ఉండగా 50వేలకు పైగా దళిత ఓటర్లు ఉన్నారు. దళితుల్లో ఆయన సామాజిక వర్గానికి చెందిన మాదిగ వర్గం వారే 40వేలకు పైగా ఉన్నారు. నాయకుడు కన్నా మీలో ఒకడిని అంటూ ఆయన గతంలో అక్కడ పనిచేసిన దళిత నాయకులకన్నా మరింత చొరవతో ముందుకు సాగి వారిలో ఒకరుగా మారారు. దళితవాడలన్నీ ఆయన్ను అక్కున చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకోవైపు రాజకీయంగా పెత్తనం చెలాయించే నాయకులు కూడా ఆయన పట్టుదలను గుర్తించి చేరువయ్యారు. ఏదైనా ఒక పని పట్టుదలతో సాధిస్తున్న ఆయన తత్వం పట్ల నాయకులు ఆకర్షితులై వైసీపీ నుంచి భారీగా టీడీపీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి.

మూడేళ్ల క్రితమే బాధ్యతలు అప్పగించిన బాబు

2009 పునర్విభజన సమయంలో తిరిగి ఏర్పడిన ఎర్రగొండపాలెం నియోజకవర్గం దళితులకు రిజర్వు అయిన విషయం తెలిసిందే. స్థానిక నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్‌ తెలుగుదేశానికి అంకితమై రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఎరిక్షన్‌బాబుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. వ్యూహాత్మకంగా మూడేళ్ల క్రితమే బాధ్యతలు అప్పగించగా ఆయన కూడా స్థానికంగా ఉంటూ పార్టీ శ్రేణులతో పాటు పార్టీలో మమేకమయ్యేందుకు పూర్తి ప్రాధాన్యత ఇచ్చారు. నియోజకవర్గంలో 94 పంచాయతీలు సుమారు 200 గ్రామాలు ఉన్నాయి. అందులో నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని ఆసరా చేసుకొని గిరిజన ప్రజలు నివసించే పల్లెలు అధికంగా ఉన్నాయి. దీంతో ఎరిక్షన్‌బాబు తొలి ఏడాదిలోనే ఒక పర్యాయం అన్ని గ్రామాలను సందర్శించి టీడీపీ నాయకులు, శ్రేణులతో పాటు ప్రజలను పరిచయం చేసుకున్నారు. అదే సమయంలో గ్రామాల వారీ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు. తొలివిడతగా తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన ప్రయత్నాలను ప్రజలకు వివరిస్తూ రెండో ఏడాదిలో మరోసారి గ్రామాలన్నీ చుట్టేశారు. ఈ ఏడాదిలో ఎన్నికల సమయం కళ్లముందు కనిపిస్తున్న నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి గ్రామాలకు వెళ్లివచ్చారు. ఆయన గ్రామాలకు వెళ్లి మొక్కుబడిగా కొందరితో మాట్లాడి రావటానికే పరిమితం కాకుండా అన్ని వర్గాల ప్రజల వద్దకు వెళ్లి వారితో మమేకమవుతున్నారు. రాజకీయంగా పెత్తనం చేసే నాయకులకు అతీతంగా గిరిజనులు, దళితవాడల్లో ఆయన మకాం వేసి మరీ వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

డాక్టర్‌ మన్నె రవీంద్ర తోడుగా ప్రచారం...

చంద్రబాబు కూడా గతేడాది ఏప్రిల్‌ 27న ఎర్రగొండపాలెం వచ్చినప్పుడే ఎరిక్షన్‌బాబును అభ్యర్థిగా ప్రకటించటంతో ఆయన మరింత వూహాత్మకంగా సమరానికి సన్నద్ధం కాగలిగారు. ప్రసుత్తం జనసేన, బీజేపీలు కలవటంతోపాటు ఆ పార్టీల నాయకులు నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడైన టీడీపీ స్థానిక నాయకుడు డాక్టర్‌ మన్నె రవీంద్ర ప్రచారం చేస్తున్నారు. వీరికి తోడు ఎరిక్షన్‌బాబు కుమారుడు, కుమార్తె కూడా మారుమూల పల్లెలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అన్ని వైపులా టీడీపీ ప్రచార కార్యక్రమం దూకుడుగా కొనసాగుతోంది.

కొండేపి నియోజకవర్గానికి చెంది కాంట్రాక్టర్‌గా హైదరాబాద్‌లో ఉంటున్న వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌ నియోజకవర్గానికి వచ్చి మూడు నెలల సమయం అయింది. స్థాక వైసీపీలో ఉన్న గ్రూపుల తగాదాలను సరిచేసుకునేందుకే ఆయన సమయం సరిపోతుంది. కొంతకాలంగా ఆయన ప్రచారం చేస్తున్నా నియోజకవర్గంలో సగం గ్రామాలను కూడా సందర్శించలేని పరిస్థితి ఎదురైంది. ఉదాహరణకు 46 గ్రామాలు ఉన్న ఒక మండలంలో ప్రతి గ్రామాన్ని ఒకటి రెండుసార్లు ఎరిక్షన్‌బాబు వెళ్లి రాగా వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌ 12 గ్రామాలకు మాత్రమే వెళ్లగలిగారు. అలా వెళ్లిన గ్రామాల్లో కూడా నాయకులను కలిసేందుకే ఆయన పరిమితమయ్యారు. దీంతో వ్యకిగత పరిచయాలు, సన్నిహిత సంబంధాలు టీడీపీ అభ్యర్థి ఎరిక్షన్‌బాబుకు బాగా ఉపయోగపడుతున్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది.

Updated Date - Apr 27 , 2024 | 12:08 AM