Share News

సమరోత్సాహంతో నామినేషన్‌

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:40 AM

మార్కాపురంలో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి నామి నేషన్‌ గురువారం అట్టహాసంగా నిర్వహించారు.

సమరోత్సాహంతో నామినేషన్‌

మార్కాపురం వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 25: మార్కాపురంలో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి నామి నేషన్‌ గురువారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి సభ్యులు సమరోత్సాహంతో ర్యాలీకి హాజరయ్యారు. కూటమి తరఫున టీడీపీ నుంచి కందుల నారాయణరెడ్డి స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనాకు నామినేషన్‌ పత్రం అందించారు.

పట్టణంలోని జవహర్‌నగర్‌ కాలనీలోని కందుల నివాసం నుంచి ఉదయం 11.05 గంటలకు ప్రారంభమైన ర్యాలీ మధ్యాహ్నాం 2గంటల వరకు జరిగింది. సప్తగిరి లాడ్జి, శాంతి క్లినిక్‌ ఏరియా, దోర్నాలకూడలి, సరోజిని నాయుడు వీధి, రథం వీధి, రాజాజి వీధి, రీడింగ్‌ రూమ్‌ కూడలి నుంచి కంభం కూడలి వరకు జరిగిన ర్యాలీలో ప్రజలు మండుటెండను సైతం లెక్కచేయకుండా పాల్గొ న్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన పూల వాహనంలో మాగుంట రాఘవరెడ్డి, జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాథ్‌, సాదిక్‌, బీజేపీ నాయకులు కృష్ణారావు, నాయ కులు కందుల రామిరెడ్డి, విఘ్నేష్‌రెడ్డి, టి.సత్యనా రాయణ, వక్కలగడ్డ మల్లికార్జున్‌ తదితర ముఖ్య నాయకులు మహార్యాలీగా తరలారు. ఈ సందర్భంగా పార్టీల శ్రేణులు తీన్‌మార్‌ తప్పెట్లు, వివిధ నృత్యాలతో, డీజే సౌండ్‌లతో హోరెత్తించారు. దారి పొడవునా కందులకు ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ సంద ర్భంగా రీడింగ్‌ రూమ్‌ కూడలి వద్ద కందుల మాట్లాడు తూ.. ధనం-జనం మధ్య జరుగుతున్న పోరులో జన బలం గెలవాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ కోసం తాను పోరాటాలు చేసి సాధించానన్నారు. మార్కా పురం జిల్లా కోసం 62 రోజులు ఉద్యమం చేస్తుంటే వైసీపీ నాయకులు పోలీసులతో దానిని భగ్నం చేశారన్నారు. చంద్రబాబుతోనే మార్కాపురం జిల్లా, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవుతాయన్నారు. టీడీపీ నాయకుడు మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఓటు నారాయణ రెడ్డికి రెండో ఓటు తన తండ్రి మాగుంట శ్రీనివాసురెడ్డికి సైకిల్‌ గుర్తుపై వేసి గెలిపించాలన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. తొలుత నారా యణరెడ్డి వివిధ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కార్యక్రమంలో నాయకులు షేక్‌ మౌలాలి, కొప్పుల శ్రీనివాసులు, నాలి కొండయ్య, జనసేన, బీజేపీ నాయకు లు, భారీగా హాజరయ్యారు. పలు ప్రాంతాలలో కందుల, మాగుంటలను గజమాలలతో సత్కరించారు.

ర్యాలీకి భారీగా తరలిన శ్రేణులు

మార్కాపురం రూరల్‌ : ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందు ల నారాయణరెడ్డి నామినేషన్‌ ర్యాలీ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. దరిమడుగు గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు జవాజి రామానుజన్‌రెడ్డి ఆధ్వర్యంలో 300కు పైగా వాహనాల్లో ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీలో మార్కాపురం మండలం నుంచి సుమారు 8000 మంది పార్టీ శ్రేణులు పాల్గొన్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. కందుల నామినేషన్‌ ర్యాలీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరుకావడంతో గెలుపు ఇక లాంఛనమే అనే ధీమాలో ఆ పార్టీ కేడర్‌ ఉంది.

తర్లుపాడు : మండలంలోని 16 పంచాయతీల నుంచి తెలుగు తమ్ముళ్లు భారీగా ర్యాలీకి తరలివెళ్లారు. లారీలు, జీపులు, ఆటోలు, బైకులలో మార్కాపురం తరలివెళ్లారు. మీర్జపేటలో లారీపై సైకిల్‌ను కట్టుకుని డప్పు వాయిద్యా లతో తరలి వెళ్లారు. తర్లుపాడు, సీతానాగులవరం, చెన్నారెడ్డిపల్లి, మీర్జపేటలలో యూత్‌ నాయకులు బైకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కాపురం నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్లారు. మండలం నుంచి ఐదు వేల మంది తరలి వెళ్లారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపురెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యాక్షులు కంచెర్ల కాశయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యులు పి.గోపినాథ్‌ చౌదరి, మందా వెంకటరెడ్డి, మాజీ సర్పంచులు యక్కంటి వెంకట సుబ్బారెడ్డి, నంబుల లక్ష్మయ్య, నంబుల తిరుపతయ్య, నాయకులు రోశప్పనాయుడు, ఎ.వెంకటేశ్వరరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాసపతిరెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు తిప్పిరెడ్డి వెలుగొండారెడ్డి, మండల యూత్‌ అధ్యక్షులు మేకల వెంకట్‌, తదితరులు పాల్గొన్నారు.

పొదిలి : టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున మార్కాపురం ఉమ్మడి టీడీపీ అభ్యర్ధి కందుల నారాయణ రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి పొదిలి పట్టణం నుంచి కార్యకర్తలు భారీగా మార్కాపురం తరలివెళ్లారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనీల్‌, మాజీ ఎంపీటీసీ ఇమాంమ్‌సా, మాజీ జడ్పీటీసీ కాటూరి పెదబాబు, మండలాధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి, పట్టణాధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్‌ ఆధ్వర్యంలో టీడీపీ కేడర్‌ నామినేషన్‌ కార్యక్రమానికి తరలివెళ్లింది.

Updated Date - Apr 26 , 2024 | 12:40 AM