Share News

టీడీపీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా బైక్‌ర్యాలీ

ABN , Publish Date - May 12 , 2024 | 01:14 AM

టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డిల గెలుపును ఆకాంక్షిస్తూ పొదిలి పట్టణంలో కందుల తనయుడు కందుల విఘ్నేష్‌రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం అడ్డరోడ్డు నుండి చినబస్టాండ్‌ వరకు బైక్‌ర్యాలి నిర్వ హించారు.

టీడీపీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా బైక్‌ర్యాలీ

పొదిలి, మే 11 : టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డిల గెలుపును ఆకాంక్షిస్తూ పొదిలి పట్టణంలో కందుల తనయుడు కందుల విఘ్నేష్‌రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం అడ్డరోడ్డు నుండి చినబస్టాండ్‌ వరకు బైక్‌ర్యాలి నిర్వ హించారు. ఈ ర్యాలీలో పట్టణంతోపాటు గ్రామీ ణ ప్రాంతాల నుండి పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ అధికారంలోకి రావడం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం అంటూ నినాదాలు చేశారు. అనంతరం విఘ్నేష్‌రెడ్డి మాట్లాడుతూ మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపు కోసం ఇదే ఉత్సాహంతో పని చేయాలన్నారు. గ్రామాల్లో ఎలాంటి హింసలు జరగకుండా సామ రస్యంగా ఓటింగ్‌ జరిగేందుకు అధికారులకు సహకరించాలని కోరారు. ర్యాలీలో పట్టణ, గ్రామాల టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మార్కాపురం : తర్లుపాడు మండలంలో వైసీపీకి భారీషాక్‌ తగిలింది. మండలంలోని కారుమానుపల్లి గ్రామానికి చెందిన 40 వైసీపీ కుటుంబాలు శనివారం టీడీపీ తీర్థం పుచ్చు కున్నాయి. వారికి టీడీపీ అభ్యర్థి కందుల నారా యణరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డిలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త వెన్నా పోలిరెడ్డి, కొండా రామసుబ్బారెడ్డి, దొండపాటి అల్లూరిరెడ్డిల ఆధ్వర్యంలో వారంతా పార్టీలోకి వచ్చారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ పాత, కొత్త అనే తేడాలు లేకుండా అందరూ కలిసి టీడీపీ గెలుపునకు తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు గొలమారి శ్రీనివాసరెడ్డి, దొండపాటి వెంగళరెడ్డి, బత్తుల నాగిరెడ్డిలు పాల్గొన్నారు.

టీడీపీతో మహిళాభివృద్ధి సాధ్యం

మార్కాపురం : టీడీపీతోనే మహిళాభివృద్ధి సాధ్యమని కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంతలక్ష్మి అన్నారు. స్థానిక 9, 10 వార్డుల్లో తెలుగు మహిళలు ప్రచారం చివరి రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వసంతలక్ష్మి ఇంటింటికి తిరిగి కందుల నారాయణరెడ్డికి ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టో మహిళ లకు పెద్దపీట వేసిందన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సంవత్సరానికి ఉచితంగా మూడు సిలిండర్లు, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా వారికి సంవత్సరానికి రూ.15వేల చొప్పున, డ్వాక్రా మహిళలకు విరివిగా రుణాలు, రూ.4 వేలకు పింఛన్‌ పెంపు ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చిందన్నారు. ఆమె వెంట తెలుగు మహిళలు ప్రచారంలో పాల్గొన్నారు.

రాయవరంలో జనసేన ప్రచారం

మార్కాపురం రూరల్‌ : మండలంలోని రాయవరం గ్రామంలో శనివారం నియోజవకర్గ జనసేన ఇన్‌చార్జ్‌ ఇమ్మడి కాశీనాథ్‌ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికికి తిరిగి సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్‌డీఏ కూటమిని గెలిపిస్తే ప్రతి పేద వారికి సంక్షేమ అభి వృద్ధి పథకాలు అందు తాయని అన్నారు. రా ష్ట్రంలో ఉమ్మడి ప్రభు త్వం అధికారంలోకి రావాలన్నారు. కార్య క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయ కులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 01:14 AM