Share News

డ్వామా పీడీపై విచారణ

ABN , Publish Date - Jul 31 , 2024 | 01:12 AM

జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్‌ అర్జున్‌రావుపై వచ్చిన ఆరోపణలపై జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ విచారణ చేశారు. ప్రకాశం భవన్‌లోని తన చాంబర్‌లో మంగళ వారం రాత్రి చేపట్టిన విచారణకు అర్జున్‌రావుతో పాటు జిల్లాలోని డ్వామా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది భారీగా తరలివచ్చారు.

డ్వామా పీడీపై విచారణ
విచారణ కోసం వచ్చి జేసీ చాంబర్‌ వద్ద ఉన్న డ్వామా ఉద్యోగులు (ఇన్‌సెట్‌లో) అక్కడే వేచి ఉన్న పీడీ అర్జునరావు

జిల్లానలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులు

వివరాలు సేకరించిన జేసీ గోపాలకృష్ణ

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 30: జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్‌ అర్జున్‌రావుపై వచ్చిన ఆరోపణలపై జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ విచారణ చేశారు. ప్రకాశం భవన్‌లోని తన చాంబర్‌లో మంగళ వారం రాత్రి చేపట్టిన విచారణకు అర్జున్‌రావుతో పాటు జిల్లాలోని డ్వామా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది భారీగా తరలివచ్చారు. పీడీగా అర్జున్‌రావు వచ్చిన తర్వాత తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఉద్యోగులు జేసీ వద్ద ఏకరువు పెట్టినట్లు సమాచా రం. మండలాల వారీగా టార్గెట్‌ పెట్టి వసూళ్లు చేస్తున్నారని, ఇవ్వకపోతే మానసికంగా ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా ఇష్టారీతిన మాట్లాడుతు న్నారని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన తనిఖీలకు వస్తే కనీసం రూ.లక్ష వరకు మామూ ళ్లు అడుగుతున్నారని ఆరోపించినట్లు తెలిసింది. అంతకు ముందు పీడీ అర్జున్‌రావును కూడా విచారించారు. కాగా విచారణ కోసం భారీగా డ్వామా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తరలిరావడంతో కలెక్టరేట్‌ కోలాహలంగా మారింది. తాము పనిచేసే అధికారి వేధింపులు తట్టుకోలేక ఉద్యోగులు తరలిరావడంపై విస్తృత చర్చ నడిచింది.

Updated Date - Jul 31 , 2024 | 01:12 AM