Share News

ఖైదీలకు ఈ-ములాఖత్‌

ABN , Publish Date - May 25 , 2024 | 12:13 AM

ఖైదీలకు ఊరటనిచ్చే వార్త. వారికి ఈ-ములాఖత్‌ సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా జైలులో ఉన్న ఖైదీలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో నేరుగా ఆన్‌లైన్‌లో మాట్లాడుకోవచ్చని జైలు పర్యవేక్షణాధికారి పి.వరుణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఖైదీలకు ఈ-ములాఖత్‌

జిల్లా జైలు సూపరింటెండెంట్‌ వరుణారెడ్డి

ఒంగోలు (క్రైం), మే 24 : ఖైదీలకు ఊరటనిచ్చే వార్త. వారికి ఈ-ములాఖత్‌ సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా జైలులో ఉన్న ఖైదీలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో నేరుగా ఆన్‌లైన్‌లో మాట్లాడుకోవచ్చని జైలు పర్యవేక్షణాధికారి పి.వరుణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌లో సందర్శకుల వివరాలు, ఈమెయిల్‌, ఫోన్‌ నంబరుతో ఈ-ములాఖత్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. వారు ఏరోజు ములాఖత్‌ కావాలో కూడా నమోదు చేయాలన్నారు. అధికారులు వారి అభ్యర్థనను ఆమోదిస్తే సందర్శకుల ఈమెయిల్‌కు ములాఖత్‌కు సంబంధించిన ఓటీపీ, లింక్‌ పంపిస్తారని తెలిపారు. దీంతో వారికి కేటాయించిన సమయంలో వీడియో కాల్‌లో మాట్లాడుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ-ప్రిజనర్స్‌ వెబ్‌సైట్‌లో ఎలా నమోదు చేసుకోవాలన్న విధానాన్ని జైలు వద్ద, బ్యారక్స్‌ వద్ద నోటీస్‌ బోర్డులో ఉంచామని వివరించారు. ఈ- ములాఖత్‌ను వినియోగిం చుకోవాలని వరుణారెడ్డి తెలిపారు.

Updated Date - May 25 , 2024 | 12:13 AM