సామాజిక తనిఖీలో ‘ఉపాధి’ అక్రమాలు వెల్లడి
ABN , Publish Date - Feb 06 , 2024 | 01:22 AM
ఎర్రగొండపాలెం మండలంలో 2022 - 23 ఆర్థిక సంవత్సరాలలో జరిగిన ఉపాఽధి హామీ పనులకు సంబం ధించి పనుల్లో కూలీలకు కంటే వలంటీర్లకు వారంలో..
ఎర్రగొండపాలెం, ఫిబ్రవరి 5 : ఎర్రగొండపాలెం మండలంలో 2022 - 23 ఆర్థిక సంవత్సరాలలో జరిగిన ఉపాఽధి హామీ పనులకు సంబం ధించి పనుల్లో కూలీలకు కంటే వలంటీర్లకు వారంలో ఆరురోజులుమస్టర్లు వేసి పీల్డు అసిస్టెంట్లు తమ అభిమానాన్ని చాటుకున్నట్లు సోమవారం ఎర్రగొండపాలెంలో జరిగిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో వెలుగులోనికి వచ్చింది. మండలంలోని మురారిపల్లె గ్రామం లో ఫీల్డు అసిస్టెంటు తురిమెళ్ల బూడిదయ్య మూడు నెలల క్రితం ఇతర జిల్లాలకు వలస కూలీగా వెళ్లాడు. ఆయన స్థానంలో తురిమెళ్ల పాపయ్య బినామీ ఫీల్డ్‌అసిస్టెంట్‌గా వ్యవహ రిస్తున్నారు. కూలీలకు మస్టర్లు వేయడంతో పాటు చెల్లింపులు కూడా చేస్తున్నాడు. ఇటీవల సామాజిక తనిఖి బృందం మురారిపల్లె గ్రామానికి వెళ్లింది. పాపయ్య బినామీ పీల్డు అసిస్టెంటుగా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఫీల్డ్ అసిస్టెంట్ బూడిదయ్య, బినామీ ఫీల్డు అసిస్టెంట్ పాపయ్యపై చర్యలు తీసుకోవాలని గ్రామ మాజీ సర్పంచి బిజ్జం రమణారెడ్డి, ఒక వర్గం వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. గ్రామంలో 10 నీటికుంటల పనులకు ఈసీ కొలతలు వేయకుండానే బిల్లులు చెల్లించాడని, డీఆర్‌పీలు తెలిపారు. నాలుగు వారాలకు కూలీల కు మస్టర్లు వేయకుండా కూలీ నగదు చెల్లించారు. గంగాపాలెం, గంజివారిపల్లె, కొలుకుల, మిల్లంపల్లి, గురిజేపల్లి గ్రామాల్లో వలంటీర్లకు వారంలో 3 రోజులుకు బదులుగా 6 రోజులు మస్టర్లు వేశారు. గంజివారిపల్లెలో ఆశావర్కర్‌కు వారంరోజులు మస్టర్లు వేసి కూలీ చెల్లించారు. అమానిగుడిపాడు గ్రామంలో 3000 క్యూబిక్ మీటర్లు కందకం పనులు చేసినట్లు చూపారని, అందులో 872 క్యూబిక్ మీటర్లు కొలత తగ్గిందని డీఆర్‌పీలు తెలిపారు. కొలుకుల గ్రామంలో కండిత కందకం పనులు 24 పూర్తి చేయగా, 7 పనుల్లో కొలతలు తగ్గాయన్నారు. ఉపాధి పనుల్లో నీటికుంటల్లో చేపట్టిన పనుల్లో ప్రతిచోట కొలతలు తగ్గినట్లు సామాజిక తనిఖీలో బహిర్గతం అయ్యింది. మండలంలో మొత్తం మీద రూ.17.60 కోట్లు పనులు జరిగినట్లు రికార్డులు నమోదు చేసి చెల్లింపులు చేశారు. ప్రతి హెబిటేషన్‌లో చేసిన పనులకు ఎం-బుక్‌లో నమోదు చేసిన కొలతలకు, సామాజిక తనిఖీ డీఆర్‌పీలు నమోదు చేసిన కొలతలకు వ్యత్యాసం ఉండడంతో పనులల్లో ఎక్కువగా అవినీతి జరిగిందని ప్రజలు భావిస్తున్నారు. ఈ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో పీడీ డ్వామా కే.సేనారెడ్డి, జిల్లా విజిలెన్సు అధికారి ఝాన్సీరాణి, సహాయవిజిలెన్సు అధికారి వెంకటస్వామి, ఏపీడీ నిర్మలా దేవి, ఎంపీపీ డి.కిరణ్‌గౌడ్, జడ్పీటీసీ సభ్యులు విజయభాస్కర్, ఎంపీడీవో నాగేశ్వరప్రసాద్, ఎస్‌ఆర్‌పీ సుబ్బారావు, ఏపీవో శైలజ, ఉపాధిహామీ ఉద్యోగులు పాల్గొన్నారు.