Share News

చిరు వ్యాపారులపై ఎన్నికల ఆంక్షలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:42 AM

ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిందన్న చందంగా గిద్దలూరు తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలోని చిరువ్యాపారుల పరిస్థితి తయారైంది.

చిరు వ్యాపారులపై ఎన్నికల ఆంక్షలు

గిద్దలూరు, ఏప్రిల్‌ 18 : ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిందన్న చందంగా గిద్దలూరు తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలోని చిరువ్యాపారుల పరిస్థితి తయారైంది. నామినే షన్ల నేపథ్యంలో ఆంక్షలతో చిరు వ్యాపారులకు ఉపాధి పోయింది.

ఎన్నికల నేపథ్యంలో నామినేషన్‌ వేసేందుకు పెద్దసంఖ్యలో కార్యకర్తలు నాయకుల వెంట తరలివస్తారు. కావున టీలు కాఫీలు, టిఫిన్లు, కూల్‌డ్రింక్స్‌ లాంటివి కొనుగోలు బాగుంటుం దని చిరువ్యాపారులు ఎన్నికలపై కోటి ఆశలు పెట్టుకున్నారు. అసలు దుకాణాలే తెరవవద్దని పోలీసులు ఆంక్షలు విధించడంతో ఒక్కసారిగా వారి ఆశలు ఆవిరయ్యాయి. గిద్దలూరు తహసీ ల్దార్‌ కార్యాలయంలో నామినేషన్ల కేంద్రం ఏర్పాటు చేయడంతో కార్యాలయం బయట జాతీయ రహదారికి ఇరు వైపులా పోలీసులు బారీ కేడ్లు ఏర్పాటు చేశారు. కుమ్మరాంకట్ట నుంచి అయ్యప్పస్వామి దేవాల యం వరకు సగం రోడ్డు ను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మిగిలిన సగం రోడ్డులో మాత్రమే జాతీయ రహదారిలో వాహనాలను అనుమతించారు. దీంతో ఎదురు దెరుగా ఒకే రోడ్డులో వాహనాలు వచ్చి ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. దానికితోడు రెవెన్యూ కార్యాలయానికి అటూ ఇటూ ఉండే రోడ్డు పక్కన అంచులలో ఉన్న టీస్టాల్స్‌, హోటల్స్‌, ఇతర చిరు దుకాణాలను, బంకులను పోలీసు లు మూయించారు. దీంతో ఎన్నికల వేళ ఎక్కు వ వ్యాపారం చేసుకొని ఒకరూపాయి అదనంగా మిగిలించుకోవచ్చని భావించిన చిరు వ్యాపారు లకు అసలు ఉపాదే లేకుండా పోయింది.

Updated Date - Apr 19 , 2024 | 12:42 AM