Share News

ఎన్నికల మార్కు బదిలీలు

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:32 PM

సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసుశాఖలో భారీగా మార్పు లు చోటుచేసుకున్నాయి. ఎస్‌ఐల నుంచి డీఎస్పీల వరకు చాలావరకు బదిలీలు చేశారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా చేసి నప్పటికీ వైసీపీ నేతల కనుసన్నల్లో బదిలీలు జరిగాయి. బుధవారం రాత్రికి ఆరుగురు డీఎస్పీలు, 45 మంది ఎస్‌ఐలను స్థానచలనం చేసి భారీగా మార్పులు చేశారు.

ఎన్నికల మార్కు  బదిలీలు

పోలీసు శాఖలో భారీగా స్థానచలనం

ఆరుగురు డీఎస్పీలు, 45 మంది ఎస్సైలు

ఒంగోలు(క్రైం), ఫిబ్రవరి 1 : సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసుశాఖలో భారీగా మార్పు లు చోటుచేసుకున్నాయి. ఎస్‌ఐల నుంచి డీఎస్పీల వరకు చాలావరకు బదిలీలు చేశారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా చేసి నప్పటికీ వైసీపీ నేతల కనుసన్నల్లో బదిలీలు జరిగాయి. బుధవారం రాత్రికి ఆరుగురు డీఎస్పీలు, 45 మంది ఎస్‌ఐలను స్థానచలనం చేసి భారీగా మార్పులు చేశారు. ఒంగోలు, మార్కాపురం, దిశ, ట్రాఫిక్‌, ఎస్బీ డీఎస్సీలతోపాటు పీటీసీలో ఉన్న ఓ డీఎస్పీని మార్చేశారు. వారి స్థానాల్లో వైసీపీ నేతలు తమకు ఇష్టులను తెచ్చుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలుగా ఉన్న వారు సీఐలు, ఎస్‌ఐల విషయంలో పట్టుబట్టి మార్పులు చేయించుకున్నారు. మొత్తం 45మంది ఎస్‌ఐలు బదిలీ కాగా ప్రాధాన్యత ఉన్న పోస్టుల్లో 27 మంది, అప్రాధాన్యత పోస్టుల్లోకి 18 మంది వెళ్లారు.

భారీగా ఎస్‌ఐల బదిలీలు

త్రిపురాంతకంలో పనిచేస్తున్న బి.సుదర్శనను ఎర్రగొండపాలెం, అక్కడ పనిచేస్తున్న రాజే్‌షను పొన్నలూరుకు పంపారు. పొన్నలూరులో పనిచేస్తున్న బి.సాబశివయ్యను త్రిపురాంతకం, వీఆర్‌లో ఉన్న టి.త్యాగరాజును కనిగిరికి, అక్కడ పనిచేస్తున్న కె.మాధవరావును కొనకనమిట్లకు, అక్కడ పనిచేస్తున్న బి.బ్రహ్మనాయుడును ఎన్జీపాడుకు బదిలీ చేశారు. వీఆర్‌లో ఉన్న పి.సురే్‌షను కొండపి, కొండపిలో పనిచేస్తున్న వై.నాగరాజును ముండ్లమూరు, అక్కడ పనిచేస్తున్న క్రిష్ణయ్యను చీమకుర్తికి మార్చారు. వీఆర్‌లో ఉన్న ఎం.శివను వెలిగండ్ల, ఎల్‌.సంపత్‌కుమార్‌ను దొనకొండ, దొనకొండలో పనిచేస్తున్న ఎం.సైదుబాబును పామూరు, ఒంగోలు డీసీఆర్‌బీలో పనిచేస్తున్న ఎ.నాగేశ్వరరావును టంగుటూరు బదిలీ చేశారు. వీఆర్‌లో ఉన్న జి.శివన్నారాయణను దర్శి, ఆర్‌.సుమన్‌ కురిచేడు, యు.పున్నారావు దిశ పోలీసు స్టేషన్‌కు, సిహెచ్‌. రాజ్యలక్ష్మీ దిశ, ఎస్‌.కె.అబ్దుల్‌ రహమాన్‌ మార్కాపురం, కె.వి.కోటేశరరావును కొమరోలుకు స్థానచలనం కల్పించారు. వీఆర్‌లో ఉన్న జి.వెంకటసైదులు పెద్దారవీడు, టి.రమే్‌షబాబు పీసీపల్లి బదిలీ అయ్యారు. గిద్దలూరులో పనిచేస్తున్న వి.మహే్‌షను దిశకు, దిశలో పనిచేస్తున్న ఎం.ఫిరోజ్‌ఫాతిమా పుల్లలచెరువు, వీఆర్‌లో ఉన్న టి.కిషోర్‌బాబు, వి.ప్రేమయ్యలను ఒంగోలు వన్‌టౌన్‌కు బదిలీ చేశారు.

ఆరుగురు డీఎస్పీలు బదిలీలు

ఒంగోలు డీఎస్పీగా ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఉన్న కిషోర్‌బాబును నియమించారు. ఒంగోలులో పనిచేస్తున్న వి.నారాయణస్వామిరెడ్డిని భీమవరం ఎస్‌డీపీవోగా నియమించారు. అదేవిధంగా గుంటూరు ట్రాఫిక్‌ డీఎస్పీగా ఉన్న ఎం.బాలసుందరరావును మార్కాపురం బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న జి.వీరరాఘవరెడ్డి అనంతపురం డీఎస్పీగా నియమితులయ్యారు. ఒంగోలు ట్రాఫిక్‌ డీఎస్పీగా పనిచేస్తున్న విక్రం శ్రీనివాసరావును ఒంగోలు పీటీసీకి బదిలీ చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరు డీఎస్పీగా పనిచేస్తున్న ఏ.రామచంద్రను ఎస్బీ డీఎస్పీగా బదిలీ చేశారు. ఒంగోలులో ఎస్బీ డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.మరియదాసు గతనెల 31న ఉద్యోగ విరమణ చేశారు. ఒంగోలు పీటీసీలో పనిచేస్తున్న ఎం.సుధాకర్‌ను పల్నాడు జిల్లా దిశ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. అదే విధంగా ఒంగోలు దిశ డీఎస్పీగా పనిచేస్తున్న సీహెచ్‌.శ్రీనివాసరావును బాపట్ల క్రైమ్స్‌ డీఎస్పీగా మార్చారు. గుంటూరు ఎస్బీ డీఎస్పీగా పనిచేస్తున్న తుపాకుల వెంకటరత్నస్వామిని ఒంగోలు దిశ డీఎస్పీగా బదిలీ చేశారు.

ప్రకాశం ఎస్పీగా పరమేశ్వరరెడ్డి

తిరుపతికి గర్గ్‌ బదిలీ

ఒంగోలు(క్రైం), ఫిబ్రవరి 01: జిల్లా ఎస్పీగా పి.పరమేశ్వరరెడ్డి నియమిస్తూ చీఫ్‌ సెక్రటరీ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో పనిచేస్తున్న మలికగర్గ్‌ తిరుపతి ఎస్పీగా అక్కడ పనిచేస్తున్న పరమేశ్వరరెడ్డిని జిల్లా ఎస్పీగా మారుస్తు ఉత్తర్వులు గురువారం రాత్రి వెలువడ్డాయి. మలికగర్గ్‌ 2021 ఫిబ్రవరి 15న ఇక్కడ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో 30నెలల 16 రోజులు పనిచేశారు. అయితే చారుసిన్హా తర్వాత మహిళ అధికారి ఎస్పీగా సుదీర్ఘంగా పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు. గుడ్‌ ట్రయిల్‌ మానిటరింగ్‌ ద్వారా కేసులు సత్యరమే పరిష్కారం చేసేందుకు కృషిచేశారు. అదేవిధంగా రహదారి భద్రతపై చర్యలు తీసుకొని రోడ్డుప్రమాదాలను తగ్గించారు. నిజాయితీ గల ఆధికారిగా పేరు తెచ్చుకున్నప్పట్టికి చివర్లో ప్రజాప్రతినిధుల వత్తిళ్లకు తలొగ్గక తప్పలేదు.

Updated Date - Feb 01 , 2024 | 11:32 PM