Share News

దర్శి ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:09 AM

దర్శి ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఆదివారం రాత్రి దర్శి నగర పంచాయతీలోని 6వవార్డులో ు కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత వెంకటేశ్వరస్వామి ఆల యంలో పూజలుచేసి ప్రచారాన్ని ప్రారంభించారు.

దర్శి ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి
దర్శిలో ప్రచారం చేస్తున్న టీడీపీ కూటమి అభ్యర్ధి గొట్టిపాటి లక్ష్మీ

కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి

దర్శి, ఏప్రిల్‌ 21: దర్శి ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఆదివారం రాత్రి దర్శి నగర పంచాయతీలోని 6వవార్డులో ు కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత వెంకటేశ్వరస్వామి ఆల యంలో పూజలుచేసి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోని ప్రజలతో మాట్లాడారు. వందలాది మంది అక్కడకు చేరుకొని హారతులిచ్చి పూలవర్షం కురిపించారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈప్రాంత సమస్యలు నూతన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామన్నారు. తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షుడు యాదగిరి వాసు, సంగా తిరుపతిరావు, తెలుగు మహిళా నాయకురాలు ఎంశోభారాణి, జనసేన, బీజేపీ నాయకులు పా ల్గొన్నారు.

40 కుటుంబాలు టీడీపీలో చేరిక

కురిచేడు, ఏప్రిల్‌ 21: కురిచేడు మండలం పడమరవీరాయపాలెం గ్రామానికి చెందిన 40 కుటుంబాలు ఆదివారం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 40 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో మేకల రాంబాబు, ఎనుగంటి గోపి, శోభన్‌ బాబు, మాలెం వెంకటేశ్వర్లు, మేకల శ్రీను, శీలం నాగేశ్వర రావు, మల్లెల మల్లికార్జున రావు, ఆకుమళ్ళ మస్తాన్‌, తదితరులు ఉన్నారు.

టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ను విజయవంతం చేయాలి

దొనకొండ, ఏప్రిల్‌ 21: దర్శి నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి సోమవారం చేపట్టే నామినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆపార్టీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, నియోజకవర్గ బీసీసెల్‌ అధ్యక్షుడు మోడి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్నిగ్రామాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.

Updated Date - Apr 22 , 2024 | 12:09 AM