Share News

వైసీపీ అరాచకాలు ఎండగట్టండి

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:19 PM

టీడీపీ కార్యకర్తలు ప్రతిఇంటికి వెళ్లి సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించా లని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

వైసీపీ అరాచకాలు ఎండగట్టండి

గిద్దలూరు టౌన్‌, మార్చి 1 : టీడీపీ కార్యకర్తలు ప్రతిఇంటికి వెళ్లి సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించా లని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణం లోని చీతిరాల కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ, జనసేన పార్టీల మానిఫెస్టోను ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు వివరించాలన్నారు. గ్రామాలలో విస్తృతంగా పర్యటిం చి పార్టీ కార్యక్రమాలు వివరించారు. అంతేకాక రాష్ట్రం లో వైసీపీ అరాచకాలను కూడా ప్రజలకు తెలియ చె ప్పాలని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు లబ్ధిచెందకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్త లు పర్యటించి ప్రజల మద్దతు పొందాలన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను టీడీపీ, జనసేనలు బలపరచిన అభ్యర్ధిగా పోటీ చేయనున్న ట్లు తెలిపారు. త్వరలో జరుగనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పర్యటనను టీడీపీ క్లస్టర్‌ యూనిట్‌, బూత్‌, కుటుంబ సాధికార సరధులు విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీ సీ సభ్యుడు బుడత మధుసూదన్‌, మాజీ సర్పంచ్‌ దప్పిలి విజయభాస్కర్‌రెడ్డి, టీడీపీ నాయకులు దుత్తా బాలీశ్వరయ్య, పూనూరు భూపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు కార్యకర్తలు పాల్గొన్నారు.

అర్థవీడు (కంభం) : టీడీపీ, జనసేనల మద్దతుతో నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్‌రెడ్డి నియోజక వర్గానికి తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.1300 కోట్లు నిధులు తెచ్చి అభివృద్ధి చేశారని, అర్థవీడు మండల టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు బండ్లమూడి ఆంజనేయులు, కొనతం రంగారెడ్డి తెలిపారు. ‘బాబు ష్యూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా అర్థవీడు మండలం మొహిద్దీ న్‌పురం గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఇంటింటి కి తిరిగి ప్రచారం చేశారు. నాడు టీడీపీ హయాంలో అశోక్‌రెడ్డి చేసిన అభివృద్ధిని వివరించారు. అశోక్‌రెడ్డి గిద్దలూరులో నివాసం ఉంటూ అందుబాటులో ఉండే స్థానిక నాయకుడని, కావున అశోక్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు ఎర్రన్న, మాజీ ఎంపీపీ చిన్నకాశిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కంభం : రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని కంభం మండల టీడీపీ అధ్యక్షులు తోట శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం కంభం మండలం జంగంగుంట్ల గ్రామంలో, కంభం పట్టణంలోని తెలుగు వీధిలో టీడీపీ నాయకులు పర్యటించారు. ఇంటింటికి తిరిగి ‘మన గిద్దలూరు మన ముత్తుముల’, ‘బాబు ష్యూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ’ కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ మండల అధ్యక్షులు తోట శ్రీనివాసులు మాట్లాడు తూ టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలకు అందించే సూపర్‌సిక్స్‌ పథకాలను వివరిం చారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అర్ధవీడు (కంభం) : అర్ధవీడు మండలంలోని పలు గ్రామాలలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. టీడీపీ, జనసేనల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా ముత్తుముల అశోక్‌రెడ్డి ని గెలిపించుకునేందుకు మండలంలోని పార్టీ శ్రేణులు ముందుకు రావాలని టీడీపీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండ్లమూడి ఆంజనేయులు, కొణతం రంగారెడ్డిలు పిలుపునిచ్చారు. పాపినేనిపల్లి, అంకభూపా లెం, మొహిద్దీన్‌పురం గ్రామాల్లో ఇంటింటికి తిరిగి టీడీపీ, జనసేనల ఉమ్మడి మానిఫెస్టోలోని సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. నాడు టీడీపీ హయాంలో ఆయన ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చిన అన్నివేళలా అందుబాటులో ఉంటాడని, నియోజకవర్గ అభివృద్ది కోసం, ప్రజాసంక్షేమం కోసం కష్టపడే వ్యక్తి మన ముత్తుముల అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలన్నారు. బీసీ నాయకులు ఎర్రన్న, అర్ధవీడు మండల మాజీ ఎంపీపీ చిన్న కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:19 PM