Share News

డ్రగ్‌ మాఫియా వైసీపీదే!

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:50 PM

: మాఫియాగా మారిన వైసీపీ వారు రాష్ట్రాన్ని డ్రగ్‌ అడ్డాగా మార్చేశారని, కానీ సోషల్‌ మీడియా ద్వారా సీఎం జగన్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఆ వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించే కుట్ర చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్‌ ధ్వజమెత్తారు. ఇలాంటి విషప్రచారాన్ని సహించబోమని హెచ్చరించారు. వైసీపీ పాలకులుయువత భవిష్యత్‌ను చిదిమేశారని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

డ్రగ్‌ మాఫియా వైసీపీదే!

టీడీపీపై విషప్రచారం సహించం

యువత భవిత చిదిమేస్తున్న జగన్‌

దామచర్ల జనార్దన్‌ విమర్శ

ఒంగోలు(కార్పొరేషన్‌), మార్చి22: మాఫియాగా మారిన వైసీపీ వారు రాష్ట్రాన్ని డ్రగ్‌ అడ్డాగా మార్చేశారని, కానీ సోషల్‌ మీడియా ద్వారా సీఎం జగన్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఆ వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించే కుట్ర చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్‌ ధ్వజమెత్తారు. ఇలాంటి విషప్రచారాన్ని సహించబోమని హెచ్చరించారు. వైసీపీ పాలకులుయువత భవిష్యత్‌ను చిదిమేశారని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. విశాఖలో దొరిగిన భారీ కొకైన్‌ మాఫియా అంతా జగన్‌ పార్టీవారేనన్నారు. పూర్ణచంద్రరావు వైసీపీ సీనియర్‌ నాయకుడని, కూనం కుటుంబం మొత్తం వైసీపీ వ్యవస్థాపక సభ్యులే అని ఆయన పేర్కొన్నారు. డ్రగ్‌ మాఫియాతో ఎలాంటి సంబంధం లేకుండానే బ్రెజిల్‌ దేశాధ్యక్షుడికి విజయ్‌సాయిరెడ్డి ఎందుకు ట్విట్‌ చేశారని ప్రశ్నించారు. సీబీఐ అధికారుల విధులకు ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు ఆటంకాలు కల్పించారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో మొదటిస్థానంలో ఉన్న ఏపీని జగన్‌రెడ్డి గంజాయి, డ్రగ్స్‌ రవాణాలో మొదటి స్థానానికి చేర్చాడన్నారు. వీరభద్రరావు సోదరుడు కూనం పూర్ణచంద్రరావు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం వైసీపీ సీనీయర్‌ నేత అని, అతనికి విజయ్‌సాయిరెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలి పారు. గతంలో విజయవాడలోని ఆశి ట్రేడర్స్‌ పేరుతో ముంద్రా పోర్టులో రూ.21వేల కోట్లు విలువైన హెరాయిన్‌ దిగుమతిలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించాడన్నారు. ఇపుడు ఏకంగా డ్రై ఈస్ట్రో కలిపి రూ.50వేల కోట్లు విలువైన 25 వేల కిలోల మార్ఫిన్‌, కొకైన్‌, హెరాయిన్‌, యాంపటేమిన్‌, మెస్కిలన్‌ వంటి భయంకర డ్రగ్స్‌ ఉన్నాయని సీబీఐ తన నివేదికలో పేర్కొన్న విషయాన్ని మరువొద్దని చెప్పారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనేఉన్నాయన్నారు. బ్రెజిల్‌ నుంచి మత్తు పదార్థాలు దిగుమతి చేస్తున్నారని తెలిసి జగన్‌రెడ్డి తన అధికారులను పంపారా? అని ప్రశ్నించారు. వీటితోపాటు జగన్‌ డ్రగ్‌ మాఫియాపై 23 అంశాలపై దామచర్ల విమర్శలు చేశారు.

Updated Date - Mar 22 , 2024 | 11:50 PM