Share News

ఇంటింటికీ ‘మన కందుల’ కార్యక్రమం ప్రారంభం

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:42 AM

ఇంటింటికి మన కందుల కార్యక్రమాన్ని స్థానిక నగరపంచాయతీలోని 16వ వార్డులో కందుల నారాయణరెడ్డి ప్రారంభిం చారు.

ఇంటింటికీ ‘మన కందుల’ కార్యక్రమం ప్రారంభం

పొదిలి, ఏప్రిల్‌ 2 : ఇంటింటికి మన కందుల కార్యక్రమాన్ని స్థానిక నగరపంచాయతీలోని 16వ వార్డులో కందుల నారాయణరెడ్డి ప్రారంభిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన, బీజేపీలు బలపరిచిన ఉమ్మడి మార్కాపురం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తనకు మద్దతు ఇవ్వాలని అభ్య ర్థించారు. గతంలో రెండుపార్యాయాలు ఓటమి పాలైనానని అయినప్పటికీ మీలో ఒకడిగా ఉంటూ ప్రజల కష్టాల్లో పాలుపంచుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ప్రజల మద్దతు టీడీపీకే ఉంద న్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగొండ ప్రాజెక్ట్‌ పూర్తి చేసి ప్రారంభిస్తార న్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. కనుక ప్రతి ఒక్కరూ, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని, మార్కాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా తనను అత్యధి క మొజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆయన తనయుడు విగ్నేష్‌రెడ్డి, టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీలోకి వైసీపీ నేతలు

మార్కాపురం : మార్కాపురం మాజీ శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి సమక్షంలో పులవురు వైసీపీ నాయకులు మంగళవారం టీడీపీలో చేరారు. పట్టణంలోని 29వ వార్డులో మార్కండేయ స్వామి దేవస్థానం ధర్మకర్త రాచకొండ రాములక్క ఆధ్వర్యంలో 20 కుటుంబాలవారు టీడీపీలో చేరారు. 30, 31 వార్డుల నుంచి దుర్గా యూత్‌ ఆధ్వర్యంలో దగ్గుల శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 25 కుటుంబా లు టీడీపీలో చేరాయి. 19 వార్డు నుంచి యల్లకర చిన్న వెంకట రంగయ్య ఆధ్వర్వంలో సుమారు 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ కార్యక్రమంలో పోల్‌మేనేజ్‌న్మెంట్‌ ఇన్‌చార్జ్‌ కందుల రామిరెడ్డి, రాష్ట్ర వాణిజ్యవిభాగం కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, టీడీపీ నాయకులు షేక్‌ మౌలాలీ, పఠాన్‌ ఇబ్రహీం, పాల్గొన్నారు.

చంద్రబాబుతోనే మహిళలకు రక్షణ

మార్కాపురం : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితోనే మహిళ లకు రక్షణ సాధ్యమని మాజీఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి వసంతలక్ష్మి అన్నారు. పట్టణంలోని 4వ వార్డులో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో జగన్‌పాలనలో మహిళ లు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్‌సిక్స్‌ను ఇంటింటికీ ప్రచారం చేశారు. మహిళలకు టీడీపీ ప్రభుత్వం వస్తే కలిగే ప్రయోజనాలను వివరించారు. తెలుగు దేశం, జనసేన, కూటమి అభ్యర్ధులు కందుల నారాయణరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డిలకు ఓటువేసి గెలిపించాలని ప్రచారం చేశారు. కార్యక్రమంలో మాజీకౌన్సిలర్‌ మర్రి ఝాన్సీ, తెలుగుయువత నాయకులు కందుల రోహిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:42 AM