Share News

బెదిరింపులకు భయపడొద్దు!

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:14 PM

మొండిగా వ్యవరిస్తున్న వైసీపీ ప్రభుత్వ మెడలు వంచి అంగన్‌వాడీల హ క్కులు సాధిస్తామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి పేర్కొన్నారు. బల్లికుర వలో గత 21 రోజుల నుంచి త మ సమస్యలపై సమ్మె చేస్తున్న కార్యకర్తలకు ఆమె సోమవారం సంఘీబావం ప్రకటించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడు తూ సమ్మె చేస్తున్న కార్యకర్తల ను ప్రభుత్వం బెదిరిస్తుందని, ఎ వరూ భయపడాల్సిన పనిలేద న్నారు.

బెదిరింపులకు భయపడొద్దు!
బల్లికురవలో మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి

ప్రభుత్వం మెడలు వంచి

అంగన్‌వాడీల హక్కులు సాధిస్తాం

ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి

బల్లికురవ, జనవరి 1: మొండిగా వ్యవరిస్తున్న వైసీపీ ప్రభుత్వ మెడలు వంచి అంగన్‌వాడీల హ క్కులు సాధిస్తామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి పేర్కొన్నారు. బల్లికుర వలో గత 21 రోజుల నుంచి త మ సమస్యలపై సమ్మె చేస్తున్న కార్యకర్తలకు ఆమె సోమవారం సంఘీబావం ప్రకటించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడు తూ సమ్మె చేస్తున్న కార్యకర్తల ను ప్రభుత్వం బెదిరిస్తుందని, ఎ వరూ భయపడాల్సిన పనిలేద న్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కలకు ముందు అబద్ధపు హమీ లు ఇచ్చి మోసం చేసిందన్నారు. మాటకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దే వుని దయ అంటారని, అదే దేవుడి దయతో జీతా లను వెంటనే పెంపుదల చేసి లక్ష మంది అంగన్‌ వాడీ కార్యకర్తల కుటుంబాలను కాపాడాలన్నారు. ప్రభుత్వం ఇదే మొండి వైఖరితో ముందుకు వెళితే ఓటు అనే ఆయుధంతో ఈ రాక్షస ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఒకటో తేది తర్వాత సమ్మె విరమించాలని, లేకుంటే విధు ల నుంచి తప్పిస్తామని ప్రభుత్వం చెబుతుందని అన్నారు. అలాంటి చర్యలు చేపడితే ఈ ప్రభుత్వం మనుగడ కూడా కష్టమవుతుందని చెప్పారు. ఒక నాడు తమిళనాడులో కూడా ఇదే పద్ధతిలో ప్రభు త్వం మొండిగా వ్యవహరించి అధికారాన్ని పొగొ ట్టుకుందని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్‌ గంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తంగిరాల వెంక టేశ్వర్లు, జి.శారద, నాగమణి, సునంద, నిర్మల, శ్రీల లిత, భారతి, సరస్వతి, సత్యవతి, శివపావని, శ్రీదే వి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

అణచాలని చూస్తే రాష్ట్రం అగ్నిగుండమే!

అద్దంకిటౌన్‌, జనవరి 1: పాదయాత్రలో ఇచ్చిన హమీలను అమలు చేయకుండా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీల ఉద్యమాన్ని అణచాలని చూస్తే రా ష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ కా ర్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నా టికి 20వ రోజుకు చేరుకుంది. తహసీల్దార్‌ కార్యా లయం ఎదుట అంగన్‌వాడీలు చేపట్టిన ధర్నా శిబి రాన్ని రమాదేవి, సీపీఎం జిల్లా కార్యదర్శిగంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు, బీఎస్పీ నాయకులు మం దా జోసఫ్‌లు సందర్శించి సంఘీభావం తెలిపా రు. ఈసందర్భంగా రమాదేవి మాట్లాడుతూ అం గన్‌వాడీల ఉద్యమానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మి క సంఘాలతో పాటు కేంద్రాల పరిధిలోని ప్రజల మద్దతు కూడగట్టి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు.

పంగులూరు: సమస్యల పరిష్కారం కోరుతూ స మ్మెబాట పట్టిన అంగన్‌వాడీలు సోమవారం పంగు లూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం కొనసాగించారు. చిన్నారులచే మ్యూ జికల్‌ చైర్‌ న్విహించి వినూత్నంగా నిరసన తెలి పారు. కార్యక్రమంలో పలువురు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

సంతమాగులూరు: అంగన్‌వాడీ కార్యకర్తలు సో మవారం నూతన సంవత్సర వేడుకలు ధర్నా శిబి రంలో నిర్వహించారు. సోమవారం జరగిన ధర్నా లో ఐద్వా రాష్ట్ర ప్రదాన కార్యదర్శి డి.రమాదేవి, సీ హెచ్‌ గంగయ్య, తంగిరాల వెంకటేశ్వర్లు, ఆర్‌.వీ రయ్య తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.

సమస్యలు పట్టించుకోరా..

మార్టూరు, జనవరి 1: అంగ న్‌వాడీలు జగన్‌ ఫ్లెక్సీ సాక్షిగా కోలాటం ప్రదర్శిస్తూ తమ స మ్మెను కొనసాగించారు. సోమ వారం మండల కాంప్లెక్స్‌ సమీ పంలో సర్వీస్‌ రోడ్డు పక్కన జగ న్‌ ఫ్లెక్సీ వద్ద అంగన్‌వాడీలు కోలాటం ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. రోడ్డుపై కూర్చొని తమ సమ స్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. జన సేన పార్టీ నాయకుడు ఎం.కిషోర్‌ సంఘీభావం తె లిపారు. సీఐటీయూ నాయకులు కందిమళ్ల రామకో టేశ్వరరావు, బత్తుల హనుమంతరావు, ఎనికపాటి రాంబాబు తదితరులు సంఘీభావం ప్రకటిం చారు.

గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు..

చినగంజాం, జనవరి 1: తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపైనే ప్రశ్నిస్తున్నా మని అంగన్‌వాడీలు అన్నారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో తమ డిమాండ్ల సాధన కో సం చేస్తున్న నిరవఽధిక సమ్మె సోమవారం 21వ రో జు కొనసాగింది. ప్రభుత్వం తమ న్యాయమైన డి మాండ్లు పరిష్కరించే వరకు సంకల్పం వీడం, స మ్మె వదలం అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆ యాలు నినదించారు. అంగన్‌వాడీలు కోలాటం వే స్తూ నిరసన తెలిపారు.

సీఐటీయూ జిల్లా నాయకుడు జి.ప్రతాప్‌ కు మార్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిరు ద్యోగుల విషయంలో మొండివైఖరి అనుసరించడం సరికాదని హితవు పలికారు. కార్యక్రమంలో మం డల పరిఽధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 11:14 PM