సీఎం సహాయ నిఽధికి రూ.లక్ష విరాళం
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:01 AM
ఏపీ కాపు టీచర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఆఽధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళాన్ని గురువారం వెలగపూడిలో సీఎం చంద్రబాబుకు అందజేశారు. రాష్ట్ర కాపు టీచర్స్ వెల్పేర్ అసోషియేషన్ అధ్యక్షుడు హరిదాసుల లీలా మాధవరావు సీఎంకు చెక్‌ను అందజేశారు.

చంద్రబాబుకు చెక్‌ను అందజేసిన కాపు టీచర్స్ ప్రతినిధి మాధవరావు
పర్చూరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఏపీ కాపు టీచర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఆఽధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళాన్ని గురువారం వెలగపూడిలో సీఎం చంద్రబాబుకు అందజేశారు. రాష్ట్ర కాపు టీచర్స్ వెల్పేర్ అసోషియేషన్ అధ్యక్షుడు హరిదాసుల లీలా మాధవరావు సీఎంకు చెక్‌ను అందజేశారు. సేవా కార్యక్రమాలలో ఏపీ కాట్వా(కెలటీఈఏ) చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో వ్యవస్ధాపకులు కొల్లా నారాయణరావు, వ్యవస్థాపక అధ్యక్షుడు ఫణీంద్ర, ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి బంగార్రాజు, రాష్ట్ర కార్యదర్శి పోతంశెట్టి రమేష్, సుబ్బారావు పాల్గొన్నారు.