దొనకొండను పారిశ్రామిక నగరంలా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - May 10 , 2024 | 11:39 PM
ప్రజల మనస్సుల్లో చోటు సంపాదించుకున్న గొట్టిపాటి రాజకీయ కుటుంబం వారసురాలిగా మీ ముందుకు వచ్చా.. ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే దొనకొండను పారిశ్రామిక నగరంలా తీర్చిదిద్దుతానని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మండలంలోని మ ల్లంపేట, బాదాపురం, గుట్టమీదపల్లి, ఎర్రబాలెం, వెంకటాపురం గ్రామాల్లో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి
దొనకొండ, మే 10: ప్రజల మనస్సుల్లో చోటు సంపాదించుకున్న గొట్టిపాటి రాజకీయ కుటుంబం వారసురాలిగా మీ ముందుకు వచ్చా.. ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే దొనకొండను పారిశ్రామిక నగరంలా తీర్చిదిద్దుతానని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మండలంలోని మ ల్లంపేట, బాదాపురం, గుట్టమీదపల్లి, ఎర్రబాలెం, వెంకటాపురం గ్రామాల్లో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా లక్ష్మి మాట్లా డుతూ గ్రామాల్లో మహిళలు తమపట్ల చూపుతున్న ఆదరణ మరువలేనిదని చెప్పారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని గెలిపించాలని కో రారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దొనకొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు వెలి గొండ నీటిని రప్పించి తాగు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్త్తామ న్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపా రావు, టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ పమిడి రమే ష్, పార్టీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వర రావు, మోడి వెంకటే శ్వర్లు, పులిమి రమణాయాదవ్, షేక్ మగ్భూల్ అహమ్మద్, డాక్టర్ మల్లిఖార్జునశర్మ, మండ్లా అంతోనిపీటర్, వల్లపునేని వెంకటస్వామి, వడ్లమూడి చెన్నయ్య, తోటా కోటేశ్వరరావు, వడ్లమూడి వెంకటేశ్వర్లు, వైకే చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
ఒక్క అవకాశం ఇవ్వండి.. నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా!
ముండ్లమూరు, మే 10: మీ బిడ్డగా ఆదరించి అవకాశం ఇవ్వండి.. నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. సేవచేసే అవకాశం కల్పించినట్లయితే ఐదు సంవత్సరాల పాటు నియోజక వర్గంలోనే ఉండి ప్రతి గ్రామాన్ని ప్రజలు ఆశించిన విధంగా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. శుక్రవారం రాత్రి ముండ్లమూరు, సింగనపాలెంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమెకు బ్రహ్మరథం పట్టారు. భారీ గజమాలలతో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ముండ్లమూరు మండలానికి, తమ కుటుంబానికి 40 సంవత్సరాలుగా విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తన తాత స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు, తన తండ్రి గొట్టిపాటి నర్సయ్య, తన బాబాయి గొట్టిపాటి రవి కుమార్‌లు ఎంతో అభివృద్ధి చేసి మండలాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారన్నారు. తనను గెలిపించినట్లయితే ఐదు సంవత్సరాల్లో ప్రతి గ్రామాన్ని నెంబరు వన్‌గా తీర్చిదిద్దుతానని చెప్పారు.
కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌లు మేదరమెట్ల వెంకటరావు, బేతపూడి బ్రహ్మేశ్వరరావు, సింగనపాలెం సర్పంచ్ మానం నరసింహారావు, కందిమళ్ళ చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.
బోదనంపాడులో బ్రహ్మరథం
కురిచేడు, మే 10: కురిచేడు మండలం బోదనంపాడు గ్రామంలో కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి బ్రహ్మరథం పట్టారు. ఇంటింటికి ఆమె తిరుగుతూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. కురిచేడులోనూ ఆమెకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, మొఘల్ మస్తాన్‌వలి, కమతం నాగిరెడ్డి, మేరువ పెద్దిరెడ్డి, కాట్రాజు నాగరాజు, మలిసెట్టి నాగేశ్వర రావు, కె.కాశీవిశ్వనాధరావు, తదితరులు పాల్గొన్నారు.