Share News

సచివాలయ నిర్మాణంలో డొల్ల

ABN , Publish Date - Apr 25 , 2024 | 10:54 PM

పది కాలాల పాటు పటిష్టంగా ఉండాల్సిన ప్రభుత్వ భవనాలు నిర్మాణ దశలోనే కూలుతుండడం విమర్శలకు తావిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ భవనాల ని ర్మాణ పనులను పరిశీలిస్తే డొల్లతనం బయటపడుతోంది. అద్దంకి మండలంలోని చక్రాయపాలెంలో రూ.40లక్షల వ్యయంతో సచివాలయం భవన నిర్మాణం జరుగు తోంది.

సచివాలయ నిర్మాణంలో డొల్ల
నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనం ... పడిపోయిన భీమ్‌లు

విరిగిన భీమ్‌లు..కప్పిపుచ్చేయత్నం

చేసిన కాంట్రాక్టర్‌

అద్దంకి, ఏప్రిల్‌ 25 : పది కాలాల పాటు పటిష్టంగా ఉండాల్సిన ప్రభుత్వ భవనాలు నిర్మాణ దశలోనే కూలుతుండడం విమర్శలకు తావిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ భవనాల ని ర్మాణ పనులను పరిశీలిస్తే డొల్లతనం బయటపడుతోంది. అద్దంకి మండలంలోని చక్రాయపాలెంలో రూ.40లక్షల వ్యయంతో సచివాలయం భవన నిర్మాణం జరుగు తోంది. ఇంకా పనులు పూర్తి కాక ముందే కిటికీలపై పోసిన భీమ్‌ (బల్లలు) పడిపోయాయి. మరికొన్ని కూడా కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. పడిపోయిన భీమ్‌ల ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కాంట్రాక్టర్‌ ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వస్తున్నారు. గ్రామ వైసీపీ నేతలే కాంట్రాక్టర్‌లు గా మా రి నిర్మాణ పనులు చేస్తుండడంతో నాణ్యత లోపించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ దశలోనే కూలుతుండడంతో భ వన నిర్మాణం పూర్తయినా ఎక్కువ సంవత్సరాలు ఉండదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిర్మాణ పనులు నా ణ్యతతో చేపట్టేలా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 10:55 PM