Share News

మహనీయులు డొక్కా సీతమ్మ

ABN , Publish Date - Aug 16 , 2024 | 12:13 AM

నిరుపేదలకు పట్టెడు అన్నంపెట్టి ఆకలి బాధను తీర్చాలన్న సంకల్పంతో నిత్య అన్నదానం చేసిన డొక్కా సీతమ్మ మహనీయులు అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ కుమార్‌ అన్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకుడు, ప్రవాసాంధ్రుడు మన్నెం శ్రీకాంత్‌ ఆర్థిక సాయంతో ప్రతి బుధవారం డోక్కా సీతమ్మ పేరుతో అన్నదానం నిర్వహించే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.

మహనీయులు డొక్కా సీతమ్మ
అన్నం ఒడ్డిస్తున్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు

అన్నదానం ప్రారంభంలో జనసేన పార్టీ నాయకులు

పర్చూరు, ఆగస్టు 15 : నిరుపేదలకు పట్టెడు అన్నంపెట్టి ఆకలి బాధను తీర్చాలన్న సంకల్పంతో నిత్య అన్నదానం చేసిన డొక్కా సీతమ్మ మహనీయులు అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ కుమార్‌ అన్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకుడు, ప్రవాసాంధ్రుడు మన్నెం శ్రీకాంత్‌ ఆర్థిక సాయంతో ప్రతి బుధవారం డోక్కా సీతమ్మ పేరుతో అన్నదానం నిర్వహించే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు, అధికార ప్రతినిఽఽధులు రాయపాటి అరుణ, కన్నా రజని, జిల్లా కార్యదర్శి శంకరశెట్టి చిరంజీవి, జనసేన పార్టీ కార్యకర్తలు సందీప్‌ తేజ, కఠారి సురేంద్రబాబు, రమేష్‌, మణి, ఆంజనేయులు, చంటి, బాలు పాల్గొన్నారు. అనంతరం దాత మన్నె శ్రీకాంత్‌ తండ్రి శివనాగేశ్వరరావును సన్మానించారు.

Updated Date - Aug 16 , 2024 | 12:13 AM