Share News

అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించొద్దు!

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:47 PM

స్వప్రయోజనాల కోసం అభివృద్ది పనులకు ఆటంకం కల్గించటం సరికాదని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని చింతలపాలెం వద్ద ఉన్న గ్రానైట్‌ క్వారీ ప్రదేశంలో నుంచి నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ మార్గం వెళ్తుంది. దీంతో క్వారీ యజమాని రైల్వే లైన్‌ ఏర్పాటుతో తన క్వారీ నుంచి డంపింగ్‌ తీసుకెళ్లేందుకు ఎక్కువ దూరం వెళ్లి డంపింగ్‌ చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించొద్దు!
క్వారీ యజమానులతో ఫోన్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి ఆగస్టు 24: స్వప్రయోజనాల కోసం అభివృద్ది పనులకు ఆటంకం కల్గించటం సరికాదని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని చింతలపాలెం వద్ద ఉన్న గ్రానైట్‌ క్వారీ ప్రదేశంలో నుంచి నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ మార్గం వెళ్తుంది. దీంతో క్వారీ యజమాని రైల్వే లైన్‌ ఏర్పాటుతో తన క్వారీ నుంచి డంపింగ్‌ తీసుకెళ్లేందుకు ఎక్కువ దూరం వెళ్లి డంపింగ్‌ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో రైల్వే పనులను అడ్డుకుంటూ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆప్రాంతం వరకు వచ్చిన రైల్వే పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసకున్న ఎమ్మెల్యే రెవెన్యూ, మైనింగ్‌ అధికారులతో మాట్లాడి ఆయా ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. ఆర్డీవో జాన్‌ఇర్విన్‌ నుంచి ఆప్రాంతంలోని ఫీల్డ్‌మ్యాప్‌ను పరిశీలించారు. క్వారీ నిర్వాహకులకు దగ్గర దూరం ఉండేవిధంగా ప్రభుత్వభూమిలో నుంచి కొంత దారి ఏర్పాటు చేసి ఇచ్చేందుకు ఒప్పించారు. రైల్వే, మైనింగ్‌ అధికారులతోనూ మాట్లాడారు. బాదిత క్వారీ యజమాని సముఖం వ్యక్తం చేసి కోర్టులో ఉన్న పిటిషన్‌ ఉపసంహరించుకుంటామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర చొరవతో సమస్య పరిష్కారం కావటంతో అధికారులు, క్వారీ యజమానులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అశోక్‌రెడ్డి, సర్వేయర్‌ ప్రియాంక, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:47 PM