Share News

దీటుగా.. ధాటిగా

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:41 PM

రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయడంలో కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ముందు నిలిచారు. అది అసెంబ్లీ అయి నా, లేక జిల్లాస్థాయి సమావేశం అయినా రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. అలాగే జిల్లాలోని వివిధ వర్గాల సమస్యలను ఎత్తిచూపుతుండడం వైసీపీ నేతలకు కంటగింపుగా మారింది.

దీటుగా.. ధాటిగా
ఎమ్మెల్యే స్వామి

అటు అసెంబ్లీలోనూ, ఇటు జిల్లాలోనూ వైసీపీకి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన ఎమ్మెల్యే స్వామి

అధికారంతో పదేపదే అడ్డంకులు కలిగించినా లెక్కచేయని డోలా

ఒంగోలు, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయడంలో కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ముందు నిలిచారు. అది అసెంబ్లీ అయి నా, లేక జిల్లాస్థాయి సమావేశం అయినా రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. అలాగే జిల్లాలోని వివిధ వర్గాల సమస్యలను ఎత్తిచూపుతుండడం వైసీపీ నేతలకు కంటగింపుగా మారింది. వారు ఎమ్మెల్యే స్వామిని లక్ష్యంగా చేసుకుని అసెంబ్లీ సాక్షిగా దాడులకు తెగబడినా.. సొంత పార్టీ సభ్యుల సంఖ్యా బలం లేని జిల్లా స్థాయి సమావేశాలలో స్వామిపై ఒంటికాలిపై వైసీపీ ప్రజాప్రతినిధులు లేచినా.. చివరకు నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌చార్జి, ఇతర నాయకులు అనరాని మాటలు అన్నా ఏ మాత్రం అదరలేదు.. బెదరలేదు..! అందుకు రాష్ట్రస్థాయిలో అధిష్ఠానం, జిల్లాలో ఇతర ముఖ్యనేతలు, నియోజకవర్గంలో పార్టీ యువనేత దామచర్ల సత్య, అలాగే పార్టీ శ్రేణులు అంతా స్వామికి అండగా నిలిచారు.

ఒకే ఒక్కడుగా గెలిచి.. నిలిచి..

రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీకి చేదు ఫలితాలు ఎదురైన విషయం విదితమే. కేవలం 23 స్థానాలకే పరిమితం కాగా అందులోనూ నలుగురు వైసీపీకి మద్దతు తెలిపారు. ఆ విష యం అలా ఉంచితే.. రాష్ట్రం లో 33 ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాలు ఉండగా టీడీపీలో ఒకే ఒక్కడుగా కొండపి ఎస్సీ స్థానం నుంచి డా క్టర్‌ స్వామి గెలుపొందారు. రాష్ట్ర పార్టీ తరఫున ఉన్న ఏకైక దళిత ఎమ్మెల్యే ఆ పార్టీ తరఫున ఎస్సీ, ఎస్టీల సమస్యలపై గొంతు విప్పే బాధ్యత స్వామిపై పడింది. అదే సమయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లెక్కకు టీడీపీ నుంచి నలుగు రు గెలిచినా ముగ్గురు బాపట్ల జిల్లా పరిధిలోకి పోగా ప్రస్తుత ప్రకాశంజిల్లా పరిధిలో స్వామి ఒక్కరే మిగిలారు.

యావత్తు పార్టీ, దామచర్ల కుటుంబం అండగా...

నియోజకవర్గంలోని వైసీపీ బాధ్యులు స్వామిపై లేని ఆరోపణలు చేయిస్తూ, ఇతర రూపాలలో ఆటంకాలు కలిగించి ఇంటిపై రెండుసార్లు, సంగమేశ్వర వద్ద ఒకసారి, కొండపి సభలో మరోసారి భౌతిక దాడికి కూడా సిద్ధమయ్యారు. ఈ క్రమంలో యావత్తు టీడీపీ శ్రేణులు, దామచర్ల కుటుంబం ఆయనకు మద్దతుగా నిలిచారు. ఎప్పటికప్పుడు వాటిని తిప్పకొట్టి ప్రతిపక్షంలో సమర్థ నేతగా గుర్తింపు పొందారు.

వైసీపీ నేతలకు కంట్లో నలుసుగా మారిన ఎమ్మెల్యే స్వామి

అటు రాష్ట్రంలో దళిత, గిరిజన వర్గాల సమస్యల పైనా, ఇటు జిల్లాలో మొత్తం ప్రజా సమస్యలు పైనా అసెంబ్లీ లోపలా, వెలుపలా సమర్థంగా తన వాణిని బలంగా వినిపించి వైసీపీ నేతలకు కంట్లో నలుసుగా మారారు. అధికార పక్షాన్ని అవసరమైన ప్రతి సందర్భంలోనూ ఇరకాటంలో పడేసేలా, వారి తీరుని ఎండగడుతూ బలంగా గొంతు విప్పారు. టీడీపీ ప్రభుత్వంలో దళిత, గిరిజన వర్గాల సంక్షేమానికి జరిగిన కృషి, అమలు చేసిన పథకాలు, వాటి ఫలితాలు అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న నిర్లక్ష్యం, పథకాలు, దళితులపై జరుగుతున్న దాడులు అంశాలపై అసెంబ్లీ వేదికగా ముందుండి వాణి వినిపించిన స్వామి జిల్లాలోని ప్రజా సమస్యలపైనా అలాగే స్పందించారు. వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులపై ఆందోళనలు, అమరావతి రైతులకు అలాగే చంద్రబాబు అరెస్టుకు నిరసనా సాగిన ఆందోళనలు, ఆయా వర్గాలపై జరిగే దాడులను ఖండించడంలోనూ జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై యంత్రాంగాన్ని, అధికార పక్షాన్ని నిలదీయడంలోనూ ముందున్నారు. దీనిని జీర్ణించుకోలేని వైసీపీ అధినాయకులు.. స్వామిని కట్టడి చేసే విధంగా తమదైన శైలిలో ప్రయత్నించినా ఏ మాత్రం వెరవకుండా ముందుకు సాగారు.

Updated Date - Apr 18 , 2024 | 11:41 PM