20 మంది పేద విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు పంపిణీ
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:57 PM
ఎన్‌ఆర్‌ఐల సహకారంతో పాఠశాలలు, గ్రా మాలు అభివృద్ధి చెందుతున్నాయని టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్‌సాగర్ అన్నారు. ఇందుకు తానాలో రైతుల అ సోసియేషన్ చైర్మన్ జిల్లెలమూడి వెంకట్ నిదర్శనమని కొ నియాడారు.

టీడీపీ నాయకుడు డాక్టర్ లలిత్ సాగర్
దాత వెంకట్‌ను అభినందించిన ఉపాధ్యాయులు
ముండ్లమూరు, జూలై 8: ఎన్‌ఆర్‌ఐల సహకారంతో పాఠశాలలు, గ్రా మాలు అభివృద్ధి చెందుతున్నాయని టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్‌సాగర్ అన్నారు. ఇందుకు తానాలో రైతుల అ సోసియేషన్ చైర్మన్ జిల్లెలమూడి వెంకట్ నిదర్శనమని కొ నియాడారు. సోమవారం ముండ్లమూరులోని ఏపీ మోడల్ స్కూల్‌లో ఇంటర్ చది విన పేద విద్యార్థులతో పాటు మెరిట్ సాధించిన 14 మంది అద్దంకి, తెలంగాణ లోని మిర్యాలగూడెం ప్రాంతానికి చెందిన విద్యార్థులకు రూ.10 లక్షలు విలువ చేసే ల్యాప్ టాప్‌లు డాక్టర్ లలిత్‌సాగర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభకు పాఠశాల ప్రిన్సి పాల్ కె.పూర్ణచంద్రరరావు అధ్యక్షత వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ లలిత్‌సాగర్ మాట్లాడుతూ ఉత్తర అమెరికా సంఘం వారి సౌజన్యంతో పేద విద్యార్థులకు ల్యాప్ టాప్‌ల పంపిణీకి దాతైన మండలంలోని ఉల్లగల్లు గ్రామానికి చెందిన ఎన్ ఆర్‌ఐ జిల్లెలమూడి వెంకట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తాను పుట్టి పెరిగిన గ్రామంతో పాటు మండలాన్ని అభివృద్ధి చేయాలనే ఆలో చన ప్రతిఒక్కరికి కలగాలన్నారు. ఇప్పటివరకు వెంకట్ పలు సేవా కా ర్యక్రమాల్లో పాల్గొనటం శుభపరిణామమన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ ఎన్‌ఆర్‌ఐలను ప్రోత్సహిస్తుందన్నారు. మోడల్ స్కూల్‌లో నెలకొన్న సమస్యల్లో ప్రధానంగా విద్యార్ధుల కోసం బస్సు షెల్టర్, వా టర్ ప్లాంట్ ఏర్పాటుకు తన వంతు కృషిచేస్తానని చెప్పారు. మంత్రి స్వామితో మాట్లాడి హాస్టల్‌కు భవనం ఏర్పాటుచేసేందుకు కృషి చే స్తామన్నారు.
దాత, ఎన్‌ఆర్‌ఐ జిల్లెలమూడి వెంకట్ మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గ్రామంతో పాటు మండలంలోని గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పారు. మోడల్ స్కూల్‌లో విద్యార్థుల కోసం రే కుల షెడ్డుకు ఎంత ఖర్చు అయినా నిర్మిస్తామన్నారు. అనంతరం తెలం గాణ రాష్ట్రం మిర్యాలగూడెం మండలం యాదగిరిపల్లికి చెందిన తల్లిదం డ్రులు లేని పేద విద్యార్థి కుంచం శివ ఇటీవల జేఈఈ ఆల్ ఇండియా 211వ ర్యాంకు సాధించటంతో ఆ విద్యార్థికి లక్ష రూపాయల నగదు, ల్యాప్ టాప్ అందజేశారు. అలాగే, కుట్టుమిషన్లు, రైతులకు అవసరమై న పరికరాలను పంపిణీ చేస్తానని వెంకట్ చెప్పారు. అనంతరం వెంక ట్ తల్లిదండ్రులు తిరుపతయ్య, గోవిందమ్మను సన్మానించారు.
కార్యక్రమంలో వెంకట్ సోదరుడు రామకృష్ణ, వ్యాయామ ఉపాధ్యా యుడు రాముడు, తిరుమలరావు, తానా ప్రతినిధి బండి నాగేశ్వరరావు, నారారాయణ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ జోసిరెడ్డి, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కె.పూర్ణచంద్రరరావు, మాజీ సర్పంచ్ జిల్లెలమూడి చౌదరి, బిజ్జం వెంకట సుబ్బారెడ్డి, కామని పూర్ణచంద్రరరావు, రెడ్డిమాసు రాఘ వులు, కొండవీటి బాలయ్య, మందలపు శేషయ్య, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.