వైసీపీ పాలనలో బీసీలకు ఇబ్బందులు
ABN , First Publish Date - 2024-02-06T22:26:27+05:30 IST
బీసీ సామాజిక ఓ ట్లతో అధికారం చేపట్టిన వైసీపీ ప్రస్తుతం బీసీలను అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతోంద ని టీడీపీ చీరాల ఇన్‌చార్జి ఎంఎం కొండయ్య యాదవ్ పేర్కొన్నారు. స్థానిక ఒబ్బాపురంలో టీడీపీ దర్శి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మోడి వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంగళవారం రాత్రి జరిగిన జయహో బీసీ సదస్సుకు ఆ యన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
టీడీపీ చీరాల ఇన్‌చార్జి కొండయ్య
దొనకొండ, ఫిబ్రవరి 6 : బీసీ సామాజిక ఓ ట్లతో అధికారం చేపట్టిన వైసీపీ ప్రస్తుతం బీసీలను అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతోంద ని టీడీపీ చీరాల ఇన్‌చార్జి ఎంఎం కొండయ్య యాదవ్ పేర్కొన్నారు. స్థానిక ఒబ్బాపురంలో టీడీపీ దర్శి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మోడి వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంగళవారం రాత్రి జరిగిన జయహో బీసీ సదస్సుకు ఆ యన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. 2009 లో ఎంపీగా పోటీ చేసిన సమయంలో దొనకొండ ప్రాంత టీడీపీ నాయకులు కార్యకర్తలు చూపిన అభిమానం ఎన్నటికీ మరువలేన న్నారు. పార్టీకి అంకితభావంతో పనిచేసే నా యకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉం టుందన్నారు. తెలిసో తెలియకో జగన్‌కు ఓటు వేసినందుకు రాష్ర్టానికి, ప్రజలకు తీరని అ న్యాయం జరిగిందన్నారు. మాచర్లలో ఒక బీ సీకి చెందిన టీడీపీ అభిమానిని జై వైసీపీ, జై జగన్ అని అనలేదని నడిరోడ్డులో గొంతుకోసి న అరాచక పాలన ఈ రాష్ట్రంలో వైసీపీ కొనసాగిస్తుందని దుయ్యబట్టారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు గొంతెత్తి మాట్లాడితే ఒక పధకం ప్ర కారం పోలీసులతో ఎన్నో రకాలుగా ఇబ్బందు లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు, బ లహీన వర్గాల అభివృద్ధి జరుగుతుందని రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు నాదెండ్ల బ్రహ్మంచౌదరి మాట్లాడుతూ సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బలహీన వర్గాలపై దాడులు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో టీడీపీ మాత్రమే పోటీ చేయబోతుందని భరోసా ఇచ్చారు. వైసీపీ నాయకుల తప్పుడు ప్రచారాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నమ్మవద్దని పిలుపునిచ్చారు. దర్శి నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ పాలకులు ఎటువంటి అభివృద్ధి చేయలేదని, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమన్నారు. కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ దర్శి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మోడి వెంకటేశ్వర్లు, టీడీపీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, నాయకులు అంకాల మల్లికార్జున (మల్లి), యరగొర్ల బసవయ్య, బత్తుల బాలరాజు, మోడి చిన్నఆంజనేయులు, వల్లపునేని కేశవ, పలు గ్రామాలకు చెందిన బీసీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.