గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:38 AM
గ్రామాల అభి వృద్ధి టీడీపీతోనే సాధ్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తు ముల అశోక్‌రెడ్డి అన్నారు.
కొమరోలు, అక్టోబరు19 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభి వృద్ధి టీడీపీతోనే సాధ్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తు ముల అశోక్‌రెడ్డి అన్నారు. స్థానిక కొమరోలు సచివా లయం-3 రోడ్డు నుంచి ఎంపీడీవో కార్యాలయంల వరకు సిమెంటు రోడ్డును శనివారం గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమరోలు మండలంలో రూ.2.5కోట్లతో సిమెంటు రోడ్లను వేయిస్తున్న ఘనత ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వానిదేనన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో సిమెంటురోడ్లు, పలు కమ్యూనిటీ హాల్లును నిర్మించారన్నారు. మరలా కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి రాగానే పల్లె పండుగ వారోత్సావాల్లో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల్లో రూ.2.5కోట్లు నిధులతో సిమెంటు రోడ్లును నిర్మిస్తున్నా మన్నారు. కొమరోలు పట్టణంతో పెండింగ్‌లోని మినీ స్టేడియం, బీసీ, కాపు, మైనార్టీ భవనాలు, ముస్లిం షాధీఖానా భవనాలను త్వరలో పూర్తి చేస్తామని భరో సా ఇచ్చారు. కార్యాక్రమంలో ఎంపీడీవో సయ్యద్ మస్తాన్‌వలి, ఏపీవో మహాలక్ష్మి, టీడీపీ మండల అధ్యక్షులు బోనేని వెంకటే శ్వర్లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు ముత్తుముల సంజీవరెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గజ్జలకొండ నారాయణ, కాంట్రాక్టర్ వీరంరెడ్డి కృష్టారెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు బిజాల తిరుమలరెడ్డి, నాయకులు తుమ్మలపెంట వెంకట రమణ, చలిచీమల శ్రీనివాసచౌదరి, అంబారపు దామోదర్‌రెడ్డి, బిజ్జం రవింద్రారెడ్డి, అంబారపు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులకు భూమిపూజ
పొదిలి : పల్లెపండగ వారోత్సవాల్లో భాగంగా మల్లవరం, కొష్టాలపల్లి గ్రామాల్లో రూ.11 లక్షలతో సీసరోడ్లకు ఎంపీడీవో శోభన్‌బాబు భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ పంచాయతీల అభివృది ్ధకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో ఉందన్నారు. అధికారులు గ్రామస్థులను సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పం చ్ రెడ్డెబోయిన వెంకటసుబ్బయ్య, ఏపీవో వెంకట్రావు, భాస్కర్, పద్మా, ఉపాధిహామి సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృధ్దికి కృషి : ఎమ్మెల్యే కందుల
కొనకనమిట్ల : రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి టీడీపీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని నాయుడిపేట,పెదారికట్ల, సిద్దవరం గ్రామాలలో శనివారం ఆయన పల్లెపండుగ పంచాయితీ వారోత్సవాలలో భాగంగా పర్యటించారు. పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గొట్లగట్టు పంచాయితీలోని నాయుడిపేట రూ.20 లక్షలతో సీసీరోడ్లు అదేవిదంగా పెదారికట్లలో రూ.30 లక్షలు, సిద్ధవరం రూ25లక్షలతో గ్రామాలలో పలు సీసీ రోడ్లకు భూమిపూజ చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్నిగ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.