Share News

టీడీపీతోనే బీసీల అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:10 PM

తెలుగుదేశం పార్టీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని ఆపార్టీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అ న్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారత కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న జయహో బీసీ కార్యక్రమానికి బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని ఏ డు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరా వాలని పిలుపునిచ్చారు.

టీడీపీతోనే బీసీల అభివృద్ధి సాధ్యం

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

పర్చూరు, మార్చి 4: తెలుగుదేశం పార్టీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని ఆపార్టీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అ న్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారత కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న జయహో బీసీ కార్యక్రమానికి బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని ఏ డు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరా వాలని పిలుపునిచ్చారు. గుంటూరులో జరిగే ఈసభను విజయవంతం చే యాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బీసీల అభ్యున్నతికోసం తెలు గుదేశం నిర్వహిస్తున్న జయహో బీసీ సభ చరిత్రలో నిలిచిపో తుందన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బీసీలపై కక్షతోనే బీసీ సబ్‌ప్లాన్‌ ని ధులను పక్కదారి మళ్ళించారని ఆరోపించారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి, నిధులపై డిక్లరేషన్‌ ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. తె లుగుదేశం పార్టీకి బీసీలు పట్టుకొమ్మలన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని పేర్కొ న్నారు. బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు. గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జరిగే సభకు బీసీ సోదరులు తరలివచ్చి సంఘీభావం తెలపాలని ఏలూరి కోరారు.

బీసీ గర్జన సభను విజయవంతం చేయాలి

చినగంజాం, మార్చి 4: గుంటూరులో మంగళవారం జరిగే జయ హో బీసీ సభకు అధిక సంఖ్యలో హాజరై జయపద్రం చేయాలని టీడీ పీ జిల్లా బీసీ యాదవ సాధికారిక సమితి కన్వీనర్‌ నక్కల వీరరాఘవు లు, మం డల పార్టీ అధ్యక్షుడు పొద వీరయ్య పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కా ర్యాలయ ఆవరణలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌కలాం అ జాద్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన మండల పరిధిలోని బీసీ నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ సభలో బీసీ డిక్లరేషన్‌, బీసీలకు రక్షణ చట్టం అమలు తదితర విష యాలపై వివరించనున్నట్లు వీరరాఘవులు తెలిపారు. సమావేశంలో చిన గంజాం సర్పంచ్‌ రాయని ఆత్మారావు, వాటుపల్లి ఏడుకొండలు, వడ్లమూడి వెంకయ్య, కోకి భాస్కర్‌రెడ్డి, టి.జయరావు, యార్లగడ్డ లక్ష్మీ, పద్మావతి, నర హరి శ్రీనివాసరావు, షేక్‌ జిలాని, పి.పార్థసారిధి, నాంచార్యులు, బి.పిచ్చి య్య, కె.రామాంజనేయులు, సంఖ్యా శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:10 PM