టీడీపీతోనే బీసీలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:28 AM
టీడీపీ ప్రభు త్వం అధికారంలోకి వస్తేనే బీసీలకు అభివృద్ది, సంక్షేమ పథకాలు అందుతాయని, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

ఎర్రగొండపాలెం, మార్చి 5 : టీడీపీ ప్రభు త్వం అధికారంలోకి వస్తేనే బీసీలకు అభివృద్ది, సంక్షేమ పథకాలు అందుతాయని, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఎర్రగొండపాలెం మండ లం పందివానిపల్లె గ్రామంలో మంగళవారం సాయంత్రం ‘బాబుష్యూరిటి భవిష్యత్‌కు టీడీపీ గ్యారెంటీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా తాను పోటీలో ఉంటానని మీరు అందరు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలకు జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 18 నుంచి 59 సంవత్సరాలలోపు మహిళలకు నెలకు రూ.1500 నగదు, సంవత్సరానికి మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు రైతులకు రూ.20 వేలు నగదు, అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్లితే ఒక్కొక్కరికి రూ.15 వేలు నగదు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3000 నగదు, పంపిణీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారన్నారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమిలేదన్నారు. వెలిగొండప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తి చేయకుండానే ఎన్నికల కోసం ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రారంభిస్తున్నారని ఇంతకంటే అపహస్యం ఏముందని అన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, టీడీపీ ముఖ్యనాయకులు చిట్యాల వెంగలరెడ్డి, ఒంగోలు ఆదిరెడ్డి, కాయకాకుల సుబ్బయ్య, తోట మహేష్, షేక్ ఇస్మాయిల్, షేక్ మస్తాన్ వలి, కందుల నారాయణరెడ్డి, డి వెంకట్రావు, చేదూరి లక్ష్ముయ్య పాల్గొన్నారు. పందివానిపల్లె గ్రామ మహిళలు టీడీపీ అభ్యర్ధి గూడూరి ఎరిక్షన్‌బాబుకు హారతి ఇచ్చి స్వాగతం పలికారు.
వచ్చేది, టీడీపీ ప్రభుత్వమే
మార్కాపురం రూరల్ : రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి రాష్ట్ర భవిష్యత్తును కాపాడు కోవాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని 17వ బ్లాక్‌లో మంగళ వారం రాత్రి మన కోసం మన కందుల అనే కార్యక్రమానికి నాయకులతో కలిసి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా ఆ వార్డులోని ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి ఆ ప్రాంత సమస్యలను పరిష్కరించుకుందామని అన్నారు. అలాగే టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాలు ద్వారా మహిళలకు, రైతులకు అన్ని వర్గాల వారికి మంచి లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మౌలాలి, క్లస్టర్ ఇంఛార్జ్ కొప్పుల శ్రీనివాసులు, పటాన్ ఖాన్, వార్డు టీడీపీ ఇంఛార్జ్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.