Share News

శిలాఫలకం ధ్వంసం

ABN , Publish Date - Feb 28 , 2024 | 01:24 AM

సచివాలయ భవనం శిలాఫలకంలో తన పేరు లేదని వైసీపీకి చెందిన సర్పంచ్‌ దానిని ధ్వంసం చేశారు.

శిలాఫలకం ధ్వంసం
చట్లమిట్ల సచివాలయం వద్ద శిలాఫలకాన్ని పగులగొడుతున్న రేగుమానిపల్లి సర్పంచ్‌ రామాంజనేయరెడ్డి

ప్రొటోకాల్‌ పాటించలేదని వైసీపీ సర్పంచ్‌ ఆగ్రహం

పెద్దారవీడు (మార్కాపురం రూరల్‌), ఫిబ్రవరి 27: సచివాలయ భవనం శిలాఫలకంలో తన పేరు లేదని వైసీపీకి చెందిన సర్పంచ్‌ దానిని ధ్వంసం చేశారు. ఈ ఘటన పెద్దారవీడు మండలం చట్లమిట్లలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామంలో నూతన సచివాలయాన్ని నిర్మించారు. దీన్ని ఎన్నికల కోడ్‌ వచ్చే లోపు ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ సచి వాలయం గోడపై శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఆ సచివాలయం పరిధిలో చట్లమిట్లతోపాటు రేగుమానిపల్లి పంచాయతీ కూడా ఉంటుంది. అయితే అధికారులు మాత్రం దానిపై చట్లమిట్ల పాలకవర్గం పేర్లు మాత్రమే వేశారు. రేగుమానిపల్లి సర్పంచ్‌, పాలకవర్గం పేర్లు రాయలేదు. దీంతో ఆగ్రహించిన రేగుమానుపల్లి సర్పంచ్‌ రామాంజనేయరెడ్డి ఆ సచివాలయం వద్ద ఉన్న శిలాఫలకాన్ని సుత్తితో ధ్వంసం చేశారు. సచివాలయ పరిధిలోని రెండు గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, వార్డుసభ్యుల పేర్లను రాయకుండా కేవలం చట్లమిట్లకే పరిమితం చేయడం ఏమిటని ఆయన అధికారులను ప్రశ్నించారు. అధికారులు ప్రొటోకాల్‌ పాటించి రెండు గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధుల పేర్లతో శిలాఫలకాన్ని ఏర్పాటుచేయాలని కోరారు.

Updated Date - Feb 28 , 2024 | 01:24 AM