Share News

వైసీపీ పాలనలో విధ్వంసం, అరాచకం

ABN , Publish Date - Jan 09 , 2024 | 01:27 AM

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగన్‌రెడ్డి పాలనలో విధ్వంసం, అరాచకమే రాజ్యమేలిందని, టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆరోపించారు.

వైసీపీ పాలనలో విధ్వంసం, అరాచకం

గిద్దలూరు టౌన్‌, జనవరి 8 : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగన్‌రెడ్డి పాలనలో విధ్వంసం, అరాచకమే రాజ్యమేలిందని, టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఒకరి వ్యక్తి కారణంగా, ఒక రాష్ట్రంలో ఒకతరం, ప్రజలు ఇంతగా నష్టపోయిన సందర్భం దేశంలో ఎక్కడా లేదన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలు పెట్టిన జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం, అరాచకంతో కూల్చివేశాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని వ్యవసాయం, ఉద్యానవనశాఖ రైతును రోడ్డున పడవేశాడన్నారు. సస్యశామలమైన రాష్ట్రం నేడు రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు, అన్నదాతల ఆర్తనందలతో విలవిలలాడుతోందన్నారు. కౌలురైతు ఆత్మహత్యలలో రాష్ట్రం 2వ స్థానంలో, రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉందన్నారు. రైతు అప్పుల్లో దేశంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలోకి తెచ్చిన ఘనత వైసీపీ పాలకులదేనని విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేరని, డ్రిప్‌ సబ్సిడిలు రావని, మద్దతు ధర ఊసేలేదని అన్నారు. దీంతో అన్నదాతకు బతుకే లేకుండా చేసిన ఘనత జగన్‌దేనన్నారు. ఇటువంటి అరాచకవాదిని ప్రజలు క్షమించాలా అని ప్రశ్నించారు. రివర్స్‌ టెండర్ల పేరుతో ఇరిగేషన్‌ రంగాన్ని నాశనం చేశాడన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నారు. ముఖ్యమంత్రికి సాగుకష్టం, నీటి విలువ తెలుసా అని విమర్శించారు. చంద్ర బాబునాయుడు పట్టిసీమ కడితే దానిని పాడుచేసిన ఘనత కూడా జగన్‌ దేనన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రాజెక్టులు కట్టడం అలా ఉంచితే కనీసం కాలువల్లో పూడికతీయని ప్రభుత్వం ఇదేనని విమర్శించారు. వాస్తవానికి ప్రభుత్వం కాంట్రాక్టర్లను కొన్ని సందర్భాలలో బ్లాక్‌లిస్టులో పెండుతుందని, ప్రస్తుతం కాంట్రాక్టర్లే ప్రభుత్వాన్ని బ్లాక్‌లిస్టులో పెట్టడం మొదటిసారన్నారు. ప్రస్తుతం యువత భవిష్యత్తు అంధకారంగా మారిందని, జగన్‌ పాలనలో డిఎస్సీకి, పోలీసుల ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రానికి పరిశ్ర మలు వస్తే, జగన్‌ హయాంలో మాఫియా వచ్చిందని విమర్శించారు. నేడు గంజాయి రాజ్యమేలుతుందన్నారు. టీడీపీ హయాంలో ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు కల్పిస్తే ఈయన మాత్రం వలంటీర్‌ మటన్‌, ఫిష్‌మార్ట్‌లలో ఉద్యోగాలు ఇచ్చారన్నారు. పన్నుల భారంతో ప్రజల రక్తాన్ని పీలుస్తున్నాడన్నారు. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన అన్నాక్యాంటీన్‌, చంద్రన్నకానుక, బెస్ట్‌స్కూల్స్‌, ఫీజ్‌ రీఇంబర్స్‌మెంట్‌, దళిత, బీసీల పథకాలన్నింటిని గంగలో కలిపాడన్నారు. రానున్న మూడు నెలల్లో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయబోతున్నారని అన్నారు. మద్యపాన నిషేధమని సొంతబ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటు న్నాడన్నారు. సీపీఎస్‌ రద్దు అని, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని అన్నారు. టీడీపీ అదికారంలోకి రాగానే అమరావతే మన రాజధాని అని పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌యాదవ్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు షాన్షావలి, రాష్ట్ర బీసీసెల్‌ కార్యదర్శి బైలడుగు బాలయ్య యాదవ్‌, పార్లమెంటు ఉపాధ్యక్షులు గోపారపు గోపాల్‌రెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్‌ బిల్లా రమేష్‌యాదవ్‌, టీడీపీ నాయకులు బోయిళ్లపల్లి కిశోర్‌, షేక్‌ అహమ్మద్‌ బాషా, గుర్రం డానియేలు, దుత్తా బాలీశ్వరయ్య, పాముల వెంకటరమణ, ఉలాపు బాలచెన్నయ్య, ఎలిశెట్టి వెంకటప్ప, సుబ్బరాయశర్మ, మోపూరి పుల్లయ్య, చిలకల రమణయ్య, పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 01:27 AM