Share News

గ్రాసానికి గిరాకీ

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:51 PM

ఈ ఏడాది ఎండుగడ్డికి గిరాకీ పెరిగింది. కొమ్మ మూరు ఆయకట్టు పరిధిలోని మాగాణిలో వచ్చే వరిగడ్డి కొనుగోలుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, పశుపోష కులు వస్తుంటారు. ఈఏడాది ఎక్కువగా మిషన్‌ కోతలతో నూర్పుడి జర గటంతో నాణ్యమైన గడ్డికి గిరాకీ పెరిగింది.

గ్రాసానికి గిరాకీ
నూర్పిడి చేసిన గడ్డి మోపులతో వెళుతున్న ట్రాక్టర్‌

ఎకరా వరి గడ్డీ రూ.7 వేలు

చీరాల, మార్చి 9: ఈ ఏడాది ఎండుగడ్డికి గిరాకీ పెరిగింది. కొమ్మ మూరు ఆయకట్టు పరిధిలోని మాగాణిలో వచ్చే వరిగడ్డి కొనుగోలుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, పశుపోష కులు వస్తుంటారు. ఈఏడాది ఎక్కువగా మిషన్‌ కోతలతో నూర్పుడి జర గటంతో నాణ్యమైన గడ్డికి గిరాకీ పెరిగింది. ఎకరా రూ.7వేలు పలుకుతుం దని చెప్తున్నారు. మిషన్‌తో నూర్పిడి జరిగిన గడ్డి అయితే ఒక వెయ్యి తక్కువకు వస్తుందని చెప్తున్నారు.

పశువులకు అందించే మేత పాళ్లలో వరిగడ్డికి అత్యంత ప్రాధాన్యత ఉం ది. పచ్చిగడ్డి, దాణా, ఎండుగడ్డి సమపాళ్లలో పోషకులు తమ పశువులకు అందిస్తుంటారు. అందులో ప్రధానంగా పాలిచ్చే గేదెలకు ఎక్కువ ప్రాధా న్యత ఇస్తారు. వేసవిలో పచ్చిగడ్డి అందరికి దొరకదు. దీంతో ఎక్కువగా ఎండుగడ్డి, సొప్ప(ఎండబెట్టిన జొన్న, మొక్కజొన్న, శనగపొట్టు)ను విని యోగిస్తుంటారు. దీంతోపాటు అవసరమైనమేర దాణా, చిట్టు, తవుడు (నీటిలో కలపి కుడితిగా) ఇస్తుంటారు. తద్వారా పాలదిగుబడితో పాటు, వెన్నశాతం కూడా ఎక్కువగా వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అయితే, ఈ ఏడాది వరిగడ్డి ధర చుక్కలు చూస్తుంది. ప్రధానంగా వరి కోతలు ఎ క్కువగా మిషన్లతో జరిగాయి. మిషన్‌తో జరిపిన నూర్పిడికి, ఎద్దులు, లేదా ట్రాక్టర్లును తిప్పి జరిపిన నూర్పిడికి చాలా తేడా ఉంటుంది. వరిని ఈఏ డాది ఎక్కువగా యంత్రాలతో కోసి, నూర్పిళ్లు చేశారు. ఎడ్లు, ట్రాక్టర్‌తో నూర్పిడిచేయగా వచ్చిన గడ్డికి డిమాండ్‌ పెరిగింది.

80వేల ఎకరాల్లో మాగాణి సాగయినా,,

కొమ్మమూరు ఆయకట్టు పరిధిలో అధికారికంగా, అనధికారికంగా సు మారు 80వేల ఎకరాల్లో మాగాణి సాగుచేశారు. సింహభాగం కోతలు పూర్తయ్యాయి. కొందరు కుప్పలు వేశారు. ఎక్కువమంది నూర్పిళ్లుచేసి ఽవచ్చిన ధాన్యం వచ్చినట్లే విక్రయిస్తున్నారు. మొత్తం మీద ఎక్కువ మంది మిషన్లతో కోత, నూర్ఫిళ్లు చేయించారు. మిషన్ల ద్వారా జరిగిన నూర్పిడితో వచ్చిన గ డ్డిని పశువులు అంత ఇష్టంగా తినవని పోషకులు చెప్తున్నారు. దీంతో ఎక్కువమంది ట్రాక్టర్లతో నూర్పిడి చేసిన గడ్డిని కొనుగోలు చేసేం దుకు కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. కొమ్మమూరు ఆయకట్టు పరి ధిలోని 80వేల ఎకరాల్లో గడ్డి సింహభాగం ఆయా ప్రాంతాల స్థానిక పశు పోషకులు, రైతులు తమ ఎద్దులు, గేదెలకు వినియోగిస్తుంటారు. మిగిలిన గడ్డిని ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారికి విక్రయిస్తుంటారు.

భారంగా మారిన పశుపోషణ

ఏటికేటికి పశుపోషణ భారంగా మారుతోందని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడులు, ధరలతో పోలిస్తే పాల ధర అంతగా పెరగటం లేదు. ఇంటింటికి తిరిగి లేదా హోటళ్లకు విక్రయించే వారికి కొంత పర్వాలేదు. కేవలం పాలకేంద్రాలకు పాలుపోసి ఉపాధి పొం దుతున్నవారికి కష్టాలు తప్పటం లేదు. పాలల్లో వెన్న 8 శాతానికి తగ్గకుం డా వస్తేనే ఖర్చులు వస్తాయని, ఆపైన కనీసం 9,10 శాతం వస్తేనే నాలు గు రూపాయలు మిగులుతాయి. లేదంటే చాకిరికి కూలీకూడా గిట్టుబాటు కాదంటున్నారు.

Updated Date - Mar 09 , 2024 | 11:52 PM