Share News

వాగు కుంటలో యువకుడి మృతదేహం

ABN , Publish Date - Jan 18 , 2024 | 10:52 PM

వాగు కుంటలో యువకుడి మృతదేహాన్ని మండలంలోని లింగారెడ్డిప ల్లి సమీపాన పాలేటిపల్లికి వెళ్లే నీటి వాగులో గురువారం గుర్తించారు. స్థానికులు తెలిపిన వి వరాల ప్రకారం.. మండలంలోని లింగారెడ్డిపల్లికి చెందిన సందిరెడ్డి మనోహర్‌రెడ్డి (20) గత ఐదు రోజులుగా కనిపించకుండా వెళ్ళిపోయాడు.

వాగు కుంటలో యువకుడి మృతదేహం
మనోహర్‌రెడ్డి (ఫైల్‌)

ఐదురోజుల కిందట అదృశ్యం కేసు నమోదు

కనిగిరి, జనవరి 18 : వాగు కుంటలో యువకుడి మృతదేహాన్ని మండలంలోని లింగారెడ్డిప ల్లి సమీపాన పాలేటిపల్లికి వెళ్లే నీటి వాగులో గురువారం గుర్తించారు. స్థానికులు తెలిపిన వి వరాల ప్రకారం.. మండలంలోని లింగారెడ్డిపల్లికి చెందిన సందిరెడ్డి మనోహర్‌రెడ్డి (20) గత ఐదు రోజులుగా కనిపించకుండా వెళ్ళిపోయాడు. కనిపించకుండా వెళ్ళిపోయిన మనోహర్‌రెడ్డి ఐదు రోజుల తర్వాత లింగారెడ్డిపల్లి వద్ద వాగులో శ వమై తేలుతుండగా కొందరు గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని బయటికి తీశారు. కనిపించకుండా వెళ్లిపోయిన కుమారుడు వాగులో శవమై తేలడంతో తల్లితండ్రులు గుండెలవిసే లా రోదించారు. మృతికి కారణాలుమాత్రం తెలియకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. యువకుడి అదృశ్యంపై స్థానిక పీఎ్‌సలో ఫిర్యాదు కూడా నమోదు చేసిన ట్లు గత ఐదు నాలుగు రోజుల క్రితం సోషల్‌ మీడియాలో తెలియచేస్తూ ఆచూకీ తెలిసిన వా రు సమాచారం ఇవ్వాలని కోరారు. కానీ పీఎ్‌సలో మిస్సింగ్‌ కేసు నమోదు కాలేదని, మృతదే హం వివరాలు కూడా తమ దృష్టికి రాలేదని ఎస్‌ఐ మాధవరావు తెలిపారు.

Updated Date - Jan 18 , 2024 | 10:52 PM