Share News

దర్శి పోలీసులు వైసీపీకి జై..

ABN , Publish Date - May 16 , 2024 | 11:14 PM

ర్శి నియోజకవర్గంలో పోలీసులు వైసీపీకి కొమ్ముకాస్తున్నారు. బాధితులైన టీడీపీ వర్గీయులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలింగ్‌ సందర్భంగా పలుచోట్ల వైసీపీ వర్గీయులు టీడీపీ శ్రేణులపై దాడులు చేసి గాయపరిచినప్పటికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ద

దర్శి పోలీసులు వైసీపీకి జై..

అధికార పార్టీ నేతల దాడులతో గాయపడిన టీడీపీ వర్గీయులపైనే అక్రమ కేసులు

వీడియోల్లో తొలుత వైసీపీ నేతలే దాడులకు దిగినట్లు స్పష్టమైన ఆధారాలున్నా చర్యలు శూన్యం

దర్శి, మే16 : దర్శి నియోజకవర్గంలో పోలీసులు వైసీపీకి కొమ్ముకాస్తున్నారు. బాధితులైన టీడీపీ వర్గీయులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలింగ్‌ సందర్భంగా పలుచోట్ల వైసీపీ వర్గీయులు టీడీపీ శ్రేణులపై దాడులు చేసి గాయపరిచినప్పటికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దర్శి మండలంలోని బొట్లపాలెంలో ఎన్నికలకు ముందురోజు తెలుగుయువత నేతకల్లూరు సుబ్బుపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు గమ్మునున్నారు. మరుసటిరోజు పోలింగ్‌ సందర్భంగా తొలిరోజు దాడి చేసి వ్యక్తులే మళ్లీ టీడీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. ఆ దాడిలో ఇరువురికి తలలు పగలటంతో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఆ ఘాతుకాలపే సహించలేక టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి స్థానికులతో కలిసి నిందితులపై చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా ధర్నా చేశారు. అప్పటి వరకు దాడులు చేసిన వైసీపీ గూండాల గురించి పట్టించుకోకుండా ధర్నా చేశారన్న నెపంతో అభ్యర్థి లక్ష్మితోపాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. ఇదేమి అన్యాయమని అడిగినా స్పందించలేదు. మరుసటిరోజు పోలీసులు ఇరువర్గాలపై మొక్కుబడిగా కేసులు నమోదు చేశారు. బాధితులపై అన్యాయంగా కేసు నమోదు చేయడాన్ని టీడీపీ వర్గీయులు అడిగినప్పటిరీ పోలీసులు పట్టించుకోలేదు. అదేవిధంగా మండల పరిషత్‌ కార్యాలయంలో టీడీపీ నేత వీసీరెడ్డిపై వైసీపీ నాచకులు దాడి చేసినా వారిపై కేసు నమోదు చేయలేదు. ఈవీఎంలు పగలగొట్టాడన్న నెపంతో అతనిపై కేసు నమోదు చేశారు. ఈవీఎం కింద పడగా వాస్తవానికి పగిలిపోలేదు. పోలింగ్‌ యథాతథంగా నిర్వహించారు. అయినప్పటికీ పోలీసులు తమ ఇష్టానుసారం కేసు పెట్టారు. దర్శి మండలంలోని కురిచేడు రోడ్డులో ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలోని పోలింగ్‌ బూత్‌ వద్ద వైసీపీ వర్గీయులు గొడవకు దిగారు. టీడీపీ అభ్యర్థి లక్ష్మి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లే సమయంలో వైసీపీ వారు అడ్డుకుని ఆమెపై రాళ్లతో దాడికి యత్నించారు. అడ్డుకున్న టీడీపీ వర్గీయులపై కేసు పెట్టారు. ఇప్పటి వరకు తొలుత రాళ్ల దాడికి పాల్పడ్డ వైసీపీ వర్గీయులపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దేవవరంలో ఓట్లువేసి బయట నిల్చున్న టీడీపీ వర్గానికి చెందిన మహిళను ఉద్దేశపూర్వకంగా దూషించారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ ఘటనలో కూడా టీడీపీ వర్గీయులపై కేసు నమోదు చేశారు. మహిళలపై గొడవకు దిగిన వారిని గురించి పట్టించుకోలేదు. వరుసగా వైసీపీ వర్గీయులు దాడులు చేసిన విషయం వీడియోల్లో వైరల్‌ అవుతున్నాయి. సాక్ష్యాధారాలతో టీడీపీ వర్గీయులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటంలేదు.

ఇక్కడ కాకపోతే మరోచోటికి..

బాధితుల ఫిర్యాదులను పరిశీలించి న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారు. టీడీపీ వర్గీయులు ఇదేమి అన్యాయమని ఒక అధికారిని అడుగగా మాఇష్ట ప్రకారం ముందుకు పోతాంఅని సమాధానమిచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వం మారితే ఇక్కడ కాకపోతే మరోచోటకు వెళతాం. మీరు అంత కంటే ఇంకేమి చేయలేరు కదా అని ఆ పోలీస్‌ అధికారి సమాఽధానమిచ్చినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ నాయకుల సూచనల మేరకు అక్రమ కేసులు నమోదు చేయించడంపై పలువురు టీడీపీ నేతలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం

నియోజకవర్గంలో పోలింగ్‌లో జరిగిన అక్రమాలపై, టీడీపీ వర్గీయులపై దాడుల గురించి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. పలుబూత్‌ల్లో టీడీపీ ఏజెంట్‌లను బయటకు నెట్టేసిన ఘటనలపై ఆధారాలు, వైసీపీ వర్గీయులు టీడీపీ శ్రేణులపై చేసిన దాడుల వివరాలను కూడా సేకరించారు. అన్ని విషయాలను ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ వర్గాలు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.

Updated Date - May 16 , 2024 | 11:14 PM