Share News

ప్రమాదకరంగా కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్లు

ABN , Publish Date - May 26 , 2024 | 10:10 PM

దర్శి పట్టణంలో అనేకచోట్ల కంచె లేకుండా ఏర్పాటుచేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. రోడ్డు మార్జిన్‌లోనే ట్రాన్స్‌ఫార్మర్లను బిగించటంతో వాహన చోదకులు ఆదమరిచినపుడు ఢీకొట్టి ప్రమాదాలబారిన పడుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లకు, విద్యుత్తు స్తంభాలకు అనేకచోట్ల చెట్ల తీగలు అల్లుకుని షార్ట్‌సర్క్యూట్‌కు కారణమవుతున్నాయి.

ప్రమాదకరంగా కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్లు
దర్శి పట్టణంలోని లంకోజనపల్లి రోడ్డులో కంచెలేని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

- చిల్లచెట్లు అల్లుకుని తరుచూ షార్ట్‌సర్క్యూట్‌

- పట్టించుకోని అధికారులు

దర్శి, మే 26: దర్శి పట్టణంలో అనేకచోట్ల కంచె లేకుండా ఏర్పాటుచేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. రోడ్డు మార్జిన్‌లోనే ట్రాన్స్‌ఫార్మర్లను బిగించటంతో వాహన చోదకులు ఆదమరిచినపుడు ఢీకొట్టి ప్రమాదాలబారిన పడుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లకు, విద్యుత్తు స్తంభాలకు అనేకచోట్ల చెట్ల తీగలు అల్లుకుని షార్ట్‌సర్క్యూట్‌కు కారణమవుతున్నాయి. దర్శి- లంకోజనపల్లిరోడ్డు, దర్శి-కురిచేడు రోడ్డు, దర్శి-పొదిలి రోడ్డులో అనేకచోట్ల రోడ్డు మార్జిన్‌ల్లో కంచె లేకుండా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. విద్యుత్‌ స్తంభాలకు కురిచేడు రోడ్డులో విద్యుత్‌ లైన్‌వరకు చెట్ల తీగలు అల్లుకున్నాయి. గాలి సోకినప్పుడల్లా షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు రేగుతున్నాయి. దీంతో కరెంట్‌ సరఫరాకు అంతరాయం కలగడంతోపాటు ఇళ్లలోని విద్యుత్‌ పరికరాలు దెబ్బతింటున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం ఈసమస్య గురించి పట్టించుచకోవటం లేదు. గత కొంత కాలంగా ఈ సమస్యతో ్ల ప్రజలు నష్టపోతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యవైఖరి అవలంబిస్తున్నారు. ఇప్పటికైనా ప్రమాదాల నివారణకు ట్రాన్స్‌ఫార్మర్లకు కంచెలు ఏర్పాటుచేసి, విద్యుత్‌ స్తంభాలకు అల్లుకున్న చెట్ల తీగలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 26 , 2024 | 10:10 PM