చెరువునీరు వెళ్లకుండా అడ్డుకట్ట
ABN , Publish Date - Aug 08 , 2024 | 12:23 AM
మండలంలోని ఊళ్లపాలెం పంచాయతీకి చెంది న పురిణి వెంకటేశ్వర్లు తన పంట పొలంలో కుంటతీసి పాత చెరువు నుంచి కా లువ ద్వారా సాగు భూములకు వెళ్లే నీటిని మళ్లించుకున్నారు.
మంత్రి స్వామి ఆదేశాలతో కదిలిన అధికారులు
రైతులకు ఉపశమనం
సింగరాయకొండ, ఆగస్టు 7 : మండలంలోని ఊళ్లపాలెం పంచాయతీకి చెంది న పురిణి వెంకటేశ్వర్లు తన పంట పొలంలో కుంటతీసి పాత చెరువు నుంచి కా లువ ద్వారా సాగు భూములకు వెళ్లే నీటిని మళ్లించుకున్నారు. దీంతో ఐదేళ్లుగా నీరందక చుట్టు పక్కల పొలాల రైతుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారు గత వైసీపీ ప్రభుత్వంలో పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప ట్టించుకోలేదు. ఈ నెల ఒకటో తేదీన మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ఊళ్లపాలెంలో పింఛన్‌ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో రైతులు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పరిష్కరించాలని అధికా రులను మంత్రి ఆదేశించారు. దీంతో బుధవారం రెవెన్యూ అధికారులు పంట పొలాల్లోకి వెళ్లి అక్రమంగా నీటిని నిల్వ చేస్తున్న కుంటను పరిశీలించారు. చెరువు నుంచి కాలువ ద్వారా కుంటలోకి నీరు వెళ్లకుండా అడ్డుకట్ట వేయించారు. ఈ కా ర్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ తన్నీరు వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ ప్రవీణ్, వీఆర్వో మోహన్ తదితరులు పాల్గొన్నారు.