అభివృద్ధి పనులకు నిధుల కోత
ABN , Publish Date - May 12 , 2024 | 01:17 AM
ఓ వైపు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో హడావుడి చేస్తూ మరోవైపు నిధులు ఇవ్వకుండా ఎండగట్టడంలో వైసీపీకి పోటీ లేదనే చెప్పవచ్చు.

గిద్దలూరు, గిద్దలూరు టౌన్, మే 11 : ఓ వైపు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో హడావుడి చేస్తూ మరోవైపు నిధులు ఇవ్వకుండా ఎండగట్టడంలో వైసీపీకి పోటీ లేదనే చెప్పవచ్చు. ఈ ఐదేళ్ల పాలనలో అనేక అభి వృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకుండా ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది.
గిద్దలూరు పట్టణంలోని పేద కుటుంబాలకు సొంత ఇంటి కలనెరవేర్చేందుకు వీలుగా పట్టణ సమీపంలో 1408 టిడ్కో గృహాలను అప్పటి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేయించారు. ఆ పనులు 80 నుంచి 90 శాతం పూర్తయ్యాయి. అయితే వైసీపీ ప్రభు త్వం అధికారంలోకి రాగానే ఈ ఐదేళ్లలో మిగిలిన నిర్మాణ పనులను పూర్తి చేయలేదు. దీంతో 1408 కుటుంబాలు నేటికీ అద్దె ఇళ్లలోనే మగ్గుతున్నారు. ఇక గిద్దలూరు పట్టణానికి శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరిం చేందుకు వీలుగా రామన్నకతువ నుంచి గిద్దలూరుకు నీరు మళ్లించేందుకు వీలుగా అశోక్‌రెడ్డి సుమారు రూ.90 కోట్ల నిధులను మంజూరు చేయించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ నిధులను కూడా రద్దు చేయా లని చూసింది. అయితే ప్రజాగ్రహానికి భయపడి నిర్ణయా న్ని వెనక్కు తీసుకున్నది. అయితే ఈ ఐదేళ్లలో 10శాతం పనులు కూడా పూర్తికాని పరిస్థితి నెలకొంది. పైపులైన్ నిర్మాణం, ఓవర్ హెడ్ ట్యాంక్‌ల నిర్మాణం అర్ధాంతరంగ ఆగిపోయాయి. టీడీపీ హయాంలో కేవలం రూ.6 కోట్ల వ్యయంతో గుండ్ల మోటు నుంచి గిద్దలూరుకు తెచ్చిన తాగునీటి ప్రాజెక్టే అంతో ఇంతో ప్రజల గొంతు తడుపు తోంది. సగిలేరు వరద ముంపు నుంచి పట్టణ ప్రజలను కాపాడేందుకు వీలుగా రూ.14.5 కోట్లతో సగిలేరుపై చెక్‌డ్యాంల నిర్మాణం, రక్షణ గోడ నిర్మాణం, పూడికతీత పనులకు సంబంధించి ముత్తుముల అశోక్‌రెడ్డి నిధులు మంజూరు చేపించి, శంకుస్థాపన చేశారు. టెండరు కూడా పిలిచారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని కూడా రద్దు చేయడంతో పెద్దపాటి వర్షం కురిస్తే సగిలేరు నీరు ఎప్పుడు ఇళ్లలోకి వస్తుందోనని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వీలు గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి అశోక్ రెడ్డి రూ.320 కోట్ల నిధులను మంజూరు చేయించగా వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ పథకాన్ని కూడా రద్దు చేయించింది. దీంతో నేడు చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య విలయ తాండవం చేస్తూనే ఉంది. పట్టణంలో రూ.18 కోట్లతో సిమెంటు రోడ్లు, మురికినీటి కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయుంచగా వైసీపీ నాయ కులు ఏకంగా కోర్టుకు వెళ్లి పనులను నిలిపివేసిన విఽష యం విధితమే. మరో రూ.25 కోట్ల రూపాయల రోడ్ల నిధులను కూడా కోర్టుకు వెళ్లి నిలిపివేయించారు. అర్థవీడు, కొమరోలులలో రూ.3 కోట్లతో క్రీడాభివృద్ది కోసం మిని స్టేడియంల నిర్మాణం మొదలు పెట్టగా మధ్యలో వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఆపేసింది. దీంతో అవి మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి. అన్ని మండల కేంద్రాలలో అంబేడ్కర్ భవన నిర్మాణానికి రూ.3 కోట్లు, బీసీ భవనాల నిర్మాణానికి రూ.2.5 కోట్లు, గిద్దలూరులో రూ.50 లక్షలతో కాపు భవనం మంజూరు చేయించగా ఈ నిధులపై కూడా వైసీపీ వేటు వేసింది. కొమరోలు, కంభంలలో షాదీఖా నాల అభివృద్ధికి రూ.1.5 కోట్లు అశోక్‌రెడ్డి మంజూరు చేయించి శంకుస్థాపన చేయగా ఈ నిధులను కూడా రద్దు చేసి ముస్లిం మైనారిటీలకు నోట్లో మట్టి కొట్టింది. మాగుటూరు తాండా నుంచి కాటమరాజు దేవస్థానం వరకు తారురోడ్డు నిర్మించేందుకు కోటి రూపాయలు మంజూరు చేయించగా రోడ్డు వేయకుండా అడ్డుకొంది. గిద్దలూరులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను మూసి వేయించింది. దిగువ మెట్ట, రంగనాయకస్వామి దేవాల యం వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయించగా ఐదేళ్లలో ఈ పనులు నత్తనడకన నడుస్తున్నా యి. టీడీపీ ప్రభుత్వ పథకాలపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టి నిధుల కోత వేసింది. దీంతో ప్రజాసమస్యల పరిష్కారానికి అప్పటి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి చొరవ తీసుకున్నప్పటికీ, వైసీపీ అడ్డుకోవడంతో ఈ ఎన్నికల్లో వైసీపీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఐదేళ్ల పాటు సాగిన ప్రజా కంటక పాలనకు ఓటుతో బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.