Share News

అనుమతించిన మేరకే పంట సాగు చేయాలి

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:24 AM

రానున్న పం ట సీజన్‌కు పొగాకు బోర్డు అనుమతించిన మేరకే పంట సాగు చేయాలని బోర్డు చైర్మన్‌ సీహెచ్‌.య శ్వంత్‌కుమార్‌ సూచించారు.

 అనుమతించిన మేరకే పంట సాగు చేయాలి

పొగాకు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 20: రానున్న పం ట సీజన్‌కు పొగాకు బోర్డు అనుమతించిన మేరకే పంట సాగు చేయాలని బోర్డు చైర్మన్‌ సీహెచ్‌.య శ్వంత్‌కుమార్‌ సూచించారు. మంగళవారం ఒంగో లులోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సంద ర్శించారు. అక్కడ జరుగుతున్న కొనుగోళ్ళ తీరును పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో చైర్మన్‌ మాట్లాడుతూ ఈ ఏడాదివేలం ప్రారంభం నుంచి మంచిధరలు రావడం సంతోషంగా ఉం దన్నారు. అంతర్జాతీయ డిమాండ్‌ను వివరిస్తూ రానున్న సీజన్‌లో ఎప్పటికప్పుడు పొగాకు బోర్డు సూచనలను పాటిస్తూ మంచి నాణ్యతతో పంట పండించి మంచి లాభాలు పొందాలన్నారు. వేలం నిర్వహణాధికారి ఎం.సత్యశ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతులు బోర్డు అనుమతించిన విస్తీర్ణం, పరిమా ణంలోనే పంట సాగు చేయాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా పొగాకు వినియోగం తగ్గించడం వల్ల వీలైనంత వరకు రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. సమావే శంలో బోర్డు సభ్యుడు పొద వరప్రసాద్‌, బోడపా టి బ్రహ్మయ్య, రైతు నాయకులు సునీల్‌, వెంకట శేషయ్య, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 12:24 AM