Share News

‘కాంట్రాకు’్ట మోసం

ABN , Publish Date - May 16 , 2024 | 12:57 AM

వైద్యారోగ్యశాఖలో ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొవిడ్‌ను అసరా చేసుకొని అప్పట్లో పనిచేసిన వారు ఇష్టారీతిన వైద్యశాఖలో నియామకాలు చేపట్టారు.

‘కాంట్రాకు’్ట మోసం

కొవిడ్‌ సమయంలో వైద్యశాఖలో పోస్టుల భర్తీలో అక్రమాలు

కాంట్రాక్టు పేరుతో ఏజెన్సీ ద్వారా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు

పది నెలలు జీతాలు లేకుండా పనిచేసిన వైనం

రాజమహేంద్రవరంలో విచారణ చేసిన ఆర్డీ

ఒంగోలు (కలెక్టరేట్‌), మే 15: వైద్యారోగ్యశాఖలో ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొవిడ్‌ను అసరా చేసుకొని అప్పట్లో పనిచేసిన వారు ఇష్టారీతిన వైద్యశాఖలో నియామకాలు చేపట్టారు. ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్నారు. కొవిడ్‌ సమయంలో ప్రభుత్వం అత్యవసరంగా ఉద్యోగ నియామకాలను చేపట్టింది. ఆ సమయంలో కలెక్టర్లు వైద్యశాఖకే పూర్తి బాధ్యతలను అప్పగించారు. దీనిని ఆసరా చేసుకొని కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఇష్టారీతిన నియామకాలు చేపట్టారు. ఆ పోస్టులపై అవగాహన లేని వారు వైద్యశాఖలో పనిచేసే కొందరి మాటలు నమ్మి మోసపోయారు. అవుట్‌ సోర్సింగ్‌లను కూడా కాంట్రాక్టు ఉద్యోగాలుగా చెప్పడంతో భారీగా మామూళ్లు ఇచ్చి కొలువులో చేరారు. అలా వైద్యశాఖలో ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో పోస్టుల్లో 18మందిని నియమించారు. సాధారణంగా అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులను ఏజెన్సీల ద్వారా భర్తీచేస్తారు. కానీ ఆయా పోస్టులకు అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా నియామక ఉత్తర్వులు తెచ్చి కాంట్రాక్టు ఉద్యోగాలుగా నమ్మించారు. కొద్దినెలలు పనిచేసిన తర్వాత వారిని తొలగించారు. అయితే వారికి విషయం చెప్పకుండా అనధికారికంగా కొనసాగించారు. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. కొద్దిరోజుల పాటు ఆ ఫిర్యాదులు బయటకు రాకుండా వైద్యశాఖ ఉద్యోగులు మేనేజ్‌ చేశారు. అలాగే ఏదోవిధంగా కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చి రెగ్యులర్‌ చేసేవిధంగా చూసుకుంటామని డబ్బులు ఇచ్చిన వారికి నమ్మబలికారు. కానీ నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో తమను మోసం చేస్తున్నారని గుర్తించిన ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఈ వ్యవహా రంపై సమగ్ర విచారణ చేసి నివేదికను అందజేయాలని రాజమహేంద్ర వరం రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పద్మశశిధర్‌ను ఆదేశించారు. ఈ నేప థ్యంలో ఆయా పోస్టుల నియామకాలను చేపట్టిన అప్పటి డీఎంహెచ్‌వో రత్నావళితోపాటు సూపరింటెండెంట్‌, ఏవో, ఇతర సెక్షన్‌ ఉద్యోగులను సంబంధిత రికార్డులతో హాజరు కావాలని ఆర్డీ నోటీసులు జారీచేశారు. బుధవారం రాజమహేంద్ర వరంలో విచారణ చేశారు.

Updated Date - May 16 , 2024 | 12:57 AM