Share News

విద్యార్థులతో భవన నిర్మాణ పనులు

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:25 AM

విద్యార్థుల భవితను తీర్చిదిద్దాల్సిన పాఠశాలల్లో విద్యార్థులతో భవన నిర్మాణ పనులు చేయిస్తున్నారు. ఈ ఘటన మండలంలోని పందిళ్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకొంది.

విద్యార్థులతో భవన నిర్మాణ పనులు

బేస్తవారపేట, మార్చి5 : విద్యార్థుల భవితను తీర్చిదిద్దాల్సిన పాఠశాలల్లో విద్యార్థులతో భవన నిర్మాణ పనులు చేయిస్తున్నారు. ఈ ఘటన మండలంలోని పందిళ్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకొంది. పాఠశాలలో నాడు- నేడు నిధులతో ఆదనపు తరగతి గదులు నిర్మిస్తు న్నారు. దీని కోసం రూ.92 లక్షలతో నిధులు వెచ్చిస్తున్నారు. అయితే అక్కడి ప్రధానోపాధ్యా యురాలు తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్ధులతో భవన నిర్మాణ పనులు చేయిస్తున్నారు. పాఠశాల విద్యార్థులతో భవనం క్యూరింగ్‌, ఇతర పనులు చేయిస్తున్నారు. వారం రోజులుగా కాంట్రాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో విద్యార్ధులతో మోటార్‌ ద్వారా పైపుతో విద్యార్థుల్లో ఒకరి తర్వాత మరొకిరికి టైంటేబుల్‌ కేయటాయించి పనులకు వినియోగిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు తల్లిదండ్రులు హెచ్‌ఎంను హెచ్చరించినా ఆమె పట్టించుకో లేదు. ప్రస్తుతం విద్యార్థులతో పనులు చేయిస్తుం డడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులతో కలసి సంబం ధించిన ఉపాధ్యాయులను నిలదిసిన పట్టించుకోవడంలేదని దీంతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:25 AM