Share News

పూర్తికాని సచివాలయాల నిర్మాణం

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:33 AM

సచివాలయాలతోనే గ్రామా భివృద్ధి సాధ్యమని, వాటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, వాస్తవరూపం అందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఐదేళ్లు కావస్తున్నా, నేటికీ పలు సచివాలయాలు పూర్తి కాలేదు.

పూర్తికాని సచివాలయాల నిర్మాణం

రాచర్ల, ఫిబ్రవరి 19 : సచివాలయాలతోనే గ్రామా భివృద్ధి సాధ్యమని, వాటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, వాస్తవరూపం అందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఐదేళ్లు కావస్తున్నా, నేటికీ పలు సచివాలయాలు పూర్తి కాలేదు. దీంతో మండలం లోని 14 పంచాయతీల పరిధిలో సచివాలయ నిర్మాణం పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. కేవలం ఆరవీటికోట, గుడిమెట్ట గ్రామాలలో మాత్రమే సచివాలయాలు పూర్తయ్యాయి. మిగిలిన 13 పంచాయతీలలో సచివా లయాలు వివిధ దశల్లో ఉన్నాయి. మండల కేంద్రమైన రాచర్లలో ఎంపీడీవో కార్యాలయం సమీపంలో సచివాలయ భవనం పూర్తయిన ప్పటికీ ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. కాలువపల్లి, యడవల్లి పంచాయతీలలో సచివాలయ భవ న నిర్మాణాలకు రూ.25లక్షలు మంజూరు కాగా పంచాయతీ కార్యాలయంపైనే నిర్మించి అధికారులు చేతు లు దులుపుకున్నారు. మిగిలిన పంచాయతీల్లో ఇంత వరకు బిల్లులు రాకపోవడంతో సర్పంచులు సచివాలయ నిర్మాణాలను మధ్యలోనే వదిలివేశారు. సత్యవోలు సచివా లయం నిర్మాణం 50శాతం మాత్రమే పూర్తయింది. కాంట్రాక్టర్‌ నిధులు రాకపోవడంతో వదిలేశాడు. ఆ సచివాలయంలో గ్రామస్థులు పశువులను కట్టివేస్తున్నారు. ఆకవీడు, జే.పీ.చెరువు చోళ్లవీడు, అనంపల్లి, సోమిదేవి పల్లి, చినగానిపల్లి గ్రామాలలో సచివాలయాల నిర్మాణా లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అనంపల్లి సచివాలయ నిర్మాణం బాధ్యత ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు తీసుకున్నాడు. ఖర్చు భరించలేక మధ్యలోనే వదిలి వేశాడు. దీంతో ఆ సర్పంచ్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని 80శాతం పనులు పూర్తి చేశాడు. నిధులు రాకపోవడంతో 20శాతం పనులు ఆగిపోయాయి. చినగానిపల్లె పంచా యతీలో ప్రైవేటు భవనంలో సచివాలయం ఉండగా ప్రతినెలా అద్దె చెల్లించకపోవడంతో యజమాని తాళం వేశాడు. పాలకవీడు పంచాయతీలో సచివాలయ నిర్మా ణం జరుగాల్సి ఉండగా గ్రామాల పోరు కింద కోర్టు వర కు పోయింది. ఐదేళ్ళు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో వైసీపీ సర్పంచ్‌లు పూర్తిగా నష్టపోయామని బహిరంగం గానే చెబుతున్నారు. 10 చోట్ల అద్దె భవనాల్లోనే సచివాల యాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు వస్తుండడంతో పెట్టు బడులు పెట్టిన వాటికి బిల్లులు వస్తాయో, రావోనని సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు.

త్వరలోనే పూర్తి చేస్తాం

మండలంలో సచివాలయ నిర్మాణాలు పూర్తస్థాయిలో కాలేదన్నది వాస్తవమేనని, ఇప్పటికి కేవలం రెండు సచివాలయాలు మాత్రమే పూర్తయ్యాయని, మిగతా సచివాలయాలు వివిధ దశల్లో ఉన్నాయని, నిధులు మంజూరు కాకపోవడంతో నిర్మాణాలు చేపట్టడానికి ముందుకు రావడం లేదని, త్వరలో సచివాలయాల నిర్మాణాలు పూర్తి చేస్తామని పంచాయతీరరాజ్‌ జెఇ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

శ్రీనివాసరెడ్డి, జేఈ పంచాయతీరాజ్‌

Updated Date - Feb 20 , 2024 | 12:33 AM