Share News

అధికార పార్టీ కుట్రలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:13 PM

అధికార పార్టీ చేస్తున్న కుట్రలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్ర స్థాయిలో టీడీపీ నాయకులు, ఓటర్లు తమ వంతుగా కృషి చేయాలని అద్దంకి శాసన సభ్యులు గొట్టిపాటి రవికుమార్‌ సూచించారు. బుధవారం మార్టూరు సమీపంలోని జొన్నతాళిలో మండలంలోని మణికేశ్వరం, శింగరకొండపాలెం గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్‌ లెవల్‌ ఏజెంట్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయా గ్రామాల నాయకులు , కార్యకర్తలకు సూచించారు

అధికార పార్టీ కుట్రలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి
జొన్నతాళిలో మండలలోని మణికేశ్వరం, శింగరకొండపాలెం టీడీపీ నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌

అద్దంకిటౌన్‌, జనవరి 3: అధికార పార్టీ చేస్తున్న కుట్రలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్ర స్థాయిలో టీడీపీ నాయకులు, ఓటర్లు తమ వంతుగా కృషి చేయాలని అద్దంకి శాసన సభ్యులు గొట్టిపాటి రవికుమార్‌ సూచించారు. బుధవారం మార్టూరు సమీపంలోని జొన్నతాళిలో మండలంలోని మణికేశ్వరం, శింగరకొండపాలెం గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్‌ లెవల్‌ ఏజెంట్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయా గ్రామాల నాయకులు , కార్యకర్తలకు సూచించారు. ఓటరు పేజి నేస్తం పేరుతో 60 మంది ఓటర్లకు ఒ కరిని సెక్షన్‌ ఇన్‌చార్జిగా 6 మంది ప్రతి నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ క్రీయాశీలకంగా పని చేయాలన్నారు. ఈ సందర్భంగా ఓటరు పేజికి నేస్తంగా 23 మందిని ఎంపిక చేయడం పట్ల అభినందించారు. టీడీపీ అధికారంలోకి రాగానే అమ్మకు వందనం పేరుతో ఇంటిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నా వారందరికి సంవత్సరానికి రూ. 15 వేలు, యువగళం నిధికింద యువతకు నెలకు రూ. 3 వేలు, ప్రతి రైతుకు రూ. 20వేలు ఆర్థిక సాయం, బీసీలకు రక్షణ చట్టం, దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహాశక్తి కింద 18 నుంచి 59 సంవత్సరాల ప్రతి మహిళలకు 1500 రూపాయలు అందజేత పథకాలను ఇంటింటికీ తిరుగుతూ ప్రజలలోకి తీసుకువెళ్ళాలని సూచించారు. అలాగే ఓటరు జాబితాలపై ఎప్పటికప్పుడు అందరు అప్రమత్తంగా ఉండాలని, అందరం కలిసి కట్టుగా పనిచేసి పార్టీ అధికారంలోకి రావడానికి అందరం ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ యా గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయా హోదాలు కలిగిని టీడీపీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 11:13 PM