గనుల శాఖ మంత్రికి అభినందనలు
ABN , Publish Date - Jun 18 , 2024 | 10:45 PM
గనుల శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన కొల్లు రవీంద్రను మంగళవారం విజయవాడలో బల్లికురవ గ్రానైట్ క్వారీ యజమాని, మార్టురు గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానుల సంఘం అధ్యక్షుడు పత్తిపాటి సురేష్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా గ్రానైట్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మంత్రికి సురేష్ వివరించారు.
కొల్లును కలిసిన బల్లికురవ, మార్టూరు
గ్రానైట్ క్వారీ యజమానులు
బల్లికురవ. జూన్ 19 : గనుల శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన కొల్లు రవీంద్రను మంగళవారం విజయవాడలో బల్లికురవ గ్రానైట్ క్వారీ యజమాని, మార్టురు గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానుల సంఘం అధ్యక్షుడు పత్తిపాటి సురేష్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా గ్రానైట్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మంత్రికి సురేష్ వివరించారు. ఫ్యాక్టరీలలో వైసీపీ ఒత్తిడి చేసి తయారు చేయించిన సర్వే హద్దు రాళ్లు పెద్ద మెత్తంలో యజమానుల వద్ద ఉన్నాయని వీటిని తయారు చేసి గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు తీవ్రంగా నష్టపోయారని అలానే విద్యుత్ చార్జీలు గతంలో వైసీపీ పలు మార్లు పెంచడం వలన పరిశ్రమల నిర్వహణ చాలా ఇబ్బందిగా ఉందని గతంలో కరోనా సమయంలో కూడా విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి తగ్గించలేదని అలానే రాయల్టీలు పెంచడం వలన తీవ్ర నష్టాలు వస్తున్నాయని అయన దృష్టికి తెచ్చారు. త్వరలో ఫ్యాక్టరీ యజమానులు, క్వారీ యజమానులతో మరో మారు గనుల శాఖ మంత్రి రవీంద్రను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను కలిసి తమ సమస్యలను వారికి వివరిస్తామని ఈసందర్భంగా సురేష్ తెలిపారు.